గాయ‌ని సంప‌ద విలువ 10,800 కోట్లు.. కాబోయే వ‌రుడి ఆస్తి 600 కోట్లు!

పాప్ సామ్రాజ్ఞి టేలర్ స్విఫ్ట్, అమెరికన్ ఫుట్‌బాల్ స్టార్ ట్రావిస్ కెల్స్ వివాహ వేడుకకు సంబంధించిన వార్తలు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.

Update: 2026-07-03 01:30 GMT

పాప్ సామ్రాజ్ఞి టేలర్ స్విఫ్ట్, అమెరికన్ ఫుట్‌బాల్ స్టార్ ట్రావిస్ కెల్స్ వివాహ వేడుకకు సంబంధించిన వార్తలు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. ఈ జంట ప్రతిష్టాత్మక మాడిసన్ స్క్వేర్ గార్డెన్ (ఎంఎస్‌జి) వేదికగా వివాహం చేసుకోబోతున్నారు. వ‌ర‌ల్డ్ కాస్ట్ లీ వెడ్డింగ్స్ లో ఇది ఒక‌టిగా నిల‌వ‌నుంది. గాయ‌ని పెళ్లి కోసం ఎంత ఖర్చ‌వుతోంది. ఈ జంట సంపాదన ఎంత? అనే ఆసక్తికరమైన వివరాలు ఇలా ఉన్నాయి.

వెడ్డింగ్ ప్లానర్స్ - ఇండస్ట్రీ నిపుణుల అంచనాల ప్రకారం.. ఈ విలాసవంతమైన వివాహ వేడుక కోసం ఏకంగా 10 మిలియన్ డాలర్ల నుండి 20 మిలియన్ డాలర్ల వరకు ఖర్చు అవుతోంది. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు 83 కోట్ల నుండి 166 కోట్ల వరకు అన్నమాట! కేవలం మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వెన్యూను బుక్ చేసుకోవడానికే రోజుకు ఒక మిలియన్ డాలర్లు (సుమారు 8.3 కోట్లు) ఖర్చవుతుండగా.. పెళ్లి కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న కోట వంటి సెట్టింగులు, విలాసవంతమైన టెంట్లు, కట్టుదిట్టమైన భద్రత, కేవలం లైటింగ్ - సౌండ్ సిస్టమ్ కోసమే దాదాపు 8 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

ఈ పెళ్లి ఖర్చు సామాన్యులకు కొండంతగా అనిపించినా టేలర్ స్విఫ్ట్ కి ఉన్న అపారమైన ఆస్తి ముందు ఇది చాలా చిన్న సంఖ్య. ప్రస్తుతం టేలర్ స్విఫ్ట్ నికర ఆస్తి అక్షరాలా 1.3 బిలియన్ డాలర్లు. దీనిని మన రూపాయిల్లో లెక్కిస్తే దాదాపు 10,800 కోట్లకు పైమాటే! టేల‌ర్ `ఎరాస్ టూర్` సృష్టించిన సంచలనాలు, మ్యూజిక్ ఆల్బమ్స్ ద్వారా ఈ స్థాయి సంపదను ఆమె సొంతం చేసుకుంది. తన మొత్తం ఆస్తిలో టేలర్ స్విఫ్ట్ ఈ పెళ్లి కోసం ఖర్చు పెడుతోంది కేవలం 1శాతం కంటే తక్కువే కావడం విశేషం.

మరోవైపు టేల‌ర్ కాబోయే భర్త, ఎన్‌ఎఫ్ఎల్ స్టార్ ట్రావిస్ కెల్స్ కూడా సంపాదనలో తక్కువ ఏమీ కాదు. అమెరికన్ ఫుట్‌బాల్ క్రీడ‌లో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా కొనసాగుతున్న ట్రావిస్ కెల్స్ నికర ఆస్తి దాదాపు 50 మిలియన్ డాలర్ల నుండి 70 మిలియన్ డాలర్ల వరకు (సుమారు 415 కోట్ల నుండి 580 కోట్లు) ఉంటుందని అంచనా. క్రీడా ఒప్పందాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా అత‌డు ఈ స్థాయి సంపదను ఆర్జించారు.

ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ ఆస్తులను కలిపి చూస్తే... వారి సంయుక్త నికర ఆస్తి దాదాపు 1.37 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. అంటే మన భారతీయ కరెన్సీలో వీరిద్దరి ఉమ్మడి ఆస్తి విలువ సుమారు 11,400 కోట్లు. ఇంతటి అపారమైన సంపద కలిగిన గ్లోబల్ కపుల్ కాబట్టే.. తమ జీవితంలోని అతిపెద్ద వేడుకను ఎలాంటి హద్దులు లేకుండా.. అత్యంత వైభవంగా సెల‌బ్రేట్ చేసుకోవడానికి సిద్ధమయ్యారు.

Tags:    

Similar News