టైగ‌ర్ ఆఫ్ మార్ష‌ల్ ఆర్ట్స్‌.. ప‌వ‌న్‌!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్‌కల్యాణ్‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. టైగ‌ర్ ఆఫ్ మార్ష‌ల్ ఆర్ట్స్ టైటిల్ ఆయ‌న ను వ‌రించింది.;

Update: 2026-01-11 15:00 GMT

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్‌కల్యాణ్‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. టైగ‌ర్ ఆఫ్ మార్ష‌ల్ ఆర్ట్స్ టైటిల్ ఆయ‌న ను వ‌రించింది. మార్ష‌ల్ ఆర్ట్స్‌(ప్రాచీన యుద్ధ విద్య‌) అంటే ఎంతో ఇష్ట‌ప‌డే.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఈ క‌ళ‌లో సుమారు 30 ఏళ్ల‌కు పైగా సాధ‌న చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న జ‌పాన్‌కు చెందిన క‌త్తిసాము(కెంజుట్స్‌)లో ప్రావీణ్యం సంపాయించారు. దీనిలో అధికారికంగా ఆయ‌న అడుగు పెట్టారు. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఇంట‌ర్నేష‌న‌ల్ గౌర‌వం ద‌క్కింది.

క‌రాటే స‌హా.. యుద్ష‌ధ రీతుల్లో ప‌వ‌న్ కు ఆస‌క్తి ఎక్కువ‌. గ‌తంలో ప్ర‌జారాజ్యం పార్టీప్రారంభించిన‌ప్పుడు.. యువ రాజ్యం పేరుతో యువ‌త‌కు క‌ర్ర‌సాము నేర్పించారు. అలా.. ఆయ‌న అప్ప‌టి నుంచి ప్ర‌వేశం పొందారు. ఫిజిక‌ల్ ఎక్సర్‌సైజ్‌కే పరిమితం కాకుండా, జపనీస్ సమురాయ్ మార్షల్ ఆర్ట్స్‌పై దృష్టిపెట్టారు. వాటిని ఎంతో ఓర్పుగా నేర్చుకున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల్లో ప‌లు మార్ష‌ల్ ఆర్ట్స్ ఘ‌ట్టాలు క‌నిపిస్తాయి. ఈ క్రమంలోనే ఆయ‌న టైగ‌ర్ ఆఫ్ మార్ష‌ల్ ఆర్ట్స్ పుర‌స్కారం ల‌భించింది.

ఫిఫ్త్ డాన్‌!

సోగోబుడో క‌న్‌రి కై- అనే జ‌పాన్ సంస్థ నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు గ‌తంలోనే ఫిఫ్త్ డాన్ పుర‌స్కారం ల‌భించింది. వాస్త‌వానికి జ‌ప‌నీయులు మాత్ర‌మే ఈ క‌ళ‌ను నేర్చుకుంటున్నారు. కానీ, తొలిసారి జపాన్ యేత‌ర దేశాల్లో ‘సోకే మురమత్సు సెన్సై’లోని ‘టకెడా షింగెన్ క్లాన్’లో ప్రవేశం పొందిన తొలి వ్యక్తిగా, అందునా తెలుగు రాష్ట్రాల‌కు చెందిన వ్య‌క్తిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఖ్యాతిని సొంతం చేసుకున్నారు. గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ఆయనకు ‘టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్’ బిరుదు అందించింది.

Tags:    

Similar News