• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ కళ్యాణ్ నోట.. అల్లు...

పవన్ కళ్యాణ్ నోట.. అల్లు అర్జున్ మాట

| మెగా.. అల్లు ఫ్యాన్స్ మధ్య కొద్దిరోజులుగా జరుగుతున్న వార్ గురించి అందరికీ తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-10-14 09:21 GMT

మెగా.. అల్లు ఫ్యాన్స్ మధ్య కొద్దిరోజులుగా జరుగుతున్న వార్ గురించి అందరికీ తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం టైమ్ లో స్టార్ట్ అయిన మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది! పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఒక ట్వీట్ చేసి.. నంద్యాల వైసీపీ అభ్యర్థి, తన ఫ్రెండ్ శిల్పా రవికి విష్ చేయడానికి అల్లు అర్జున్ వెళ్లడంతో మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత రీసెంట్ గా తనకు నచ్చిన వాళ్ల కోసం ఏదైనా చేస్తా అన్నట్టు బన్నీ మాట్లాడడంతో రెండు కుటుంబాల ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్.. నోట అల్లు అర్జున్ పేరు వచ్చింది! అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్.. సోమవారం ఉదయం పాల్గొన్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న అభిమానులు, పార్టీ నాయకులు.. ఓజీ.. ఓజీ అని అరిచారు. దీంతో పవన్ స్పందించారు. ఆ సమయంలో అల్లు అర్జున్ పేరును ఉపయోగించారు.

ఇన్ని రోజులు కూడా మీరు(అభిమానులు) ఓజీ.. ఓజీ.. అంటుంటే నాకు మోదీ.. మోదీ అని వినిపించేదని అన్నారు. ఎంటర్టైన్మెంట్ అందరికీ కావాల్సిందేనని పవన్ తెలిపారు. అదే సమయంలో పల్లె పండగ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామనే విషయంపై మాట్లాడారు. అందరూ తమ ఫేవరేట్ హీరోల సినిమాలకు వెళ్ళాలంటే డబ్బులు ఉండాలి కదా.. అని అన్నారు. ఎంటర్టైన్మెంట్ కన్నా ముందు ప్రతీ ఒక్కరి కడుపు నిండాలని తెలిపారు. అందుకే ముందు కడుపు నింపే పని చేద్దామని పవన్ పిలుపునిచ్చారు. రోడ్లు, స్కూల్స్‌ ను బాగు చేసుకుందామని చెప్పారు.

ఆ తర్వాత... విందులు.. వినోదాలు.. ఓజీలు అంటూ చమత్కరించారు పవన్. మీ ఫేవరేట్ హీరోలు మీకు ఎంత ఇష్టమో.. నాకు కూడా అంతే ఇష్టం అని పవన్ అన్నారు. సినీ ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరోలతో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. ముఖ్యంగా సినిమాల పరంగా.. తాను ఎవరితో కూడా పోటీ పడనని చెప్పారు. చెప్పాలంటే ఒక్కొక్కరు ఒక్కో విషయంలో ఎక్సపెర్ట్ అంటూ కొనియాడారు. అందరూ బాగుండాలని కోరుకుంటానని తెలిపారు.

చిరంజీవి, బాలకృష్ణ, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, నాని.. అలా అందరూ బాగుండాలని ఎప్పుడూ తాను కోరుకుంటానని తెలిపారు పవన్. ఏదేమైనా మీ ఫేవరేట్ హీరోకి జై కొట్టాలంటే.. రాష్ట్ర ఫైనాన్షియల్ పొజిషన్ బాగుండాలని తెలిపారు. సినిమా థియేటర్ కు వెళ్ళాలంటే ముందు రోడ్లు బాగుండాలి కదా అని వ్యాఖ్యానించారు. అందుకే వాటిపై ముందు దృష్టిపెడదామని పిలుపునిచ్చారు. ప్రస్తుతం పవన్ కామెంట్స్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

Tags:    
  • Alluarjun 
  • Pawankalyan 
  • Megafans 
  • Tollywood 
  • Filmindustry 
  • OG 
  • Pushpa2 
  • Hariharaveeramallu 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS