పవర్ స్టార్ సేఫ్ గేమ్ ఆడుతున్నారా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా రిలీజ్ అంటే ఉండే హైపు వేరే లెవల్లో ఉంటుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా రిలీజ్ అంటే ఉండే హైపు వేరే లెవల్లో ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో పవన్ నుంచి రిలీజ్ అయిన చిత్రాలన్నింటిలో `ఓజీ` మాత్రమే భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ మరోసారి యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న ఆ `ఓజీ` మ్యాజిక్‌నే నమ్ముకుని తదుపరి వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ లైనప్‌లో ఉన్న సురేందర్ రెడ్డిని సైతం పక్కనబెట్టి సుజీత్ క్రియేట్ చేసిన గ్యాంగ్‌స్టర్ వరల్డ్ వైపే పవన్ మొగ్గు చూపుతున్నారు.
`ఓజీ` చిత్రంతో పవర్‌స్టార్‌లోని వింటేజ్ స్టైల్, యాటిట్యూడ్‌ను సుజీత్ ప్రెజెంట్ చేసిన విధానానికి థియేటర్లలో యూత్ పండగ చేసుకుంది. ఆ నమ్మకంతోనే హడావుడి రీమేక్‌ల జోలికి వెళ్లకుండా పక్కా ఒరిజినల్ స్క్రిప్ట్‌తో రానున్న `ఓజీ 2`ని వీలైనంత త్వరగా పట్టాలెక్కించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా నిర్మించడం విశేషం. ఆ రకంగా చాలా కాలం తర్వాత పీకే నిర్మాతగా యాక్టివ్ అయినట్లు అవుతుంది. ఇలా చేయగలిగితే తనకు కావాల్సినంత స్వేచ్ఛ కూడా ఉంటుంది.
ఈ నిర్ణయాన్ని ట్రేడ్ పండితులు పక్కా సేఫ్ గేమ్ గా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీలో వరుసగా మిశ్రమ ఫలితాలు వస్తున్నప్పుడు ఆల్రెడీ భారీ హిట్ అయి బ్రాండ్ వాల్యూ ఉన్న ప్రాజెక్ట్ సీక్వెల్‌ను ఎంచుకోవడం అనేది సురక్షితమైన బిజినెస్ మోడల్. `ఓజీ` సాధించిన భారీ ఓపెనింగ్స్, డిజిటల్ , శాటిలైట్ రైట్స్ ద్వారా వచ్చిన టేబుల్ ప్రాఫిట్స్ నిర్మాతలను సేఫ్ జోన్‌లోకి నెట్టేసాయి. అందుకే రిస్క్ చేయడం కంటే ఆల్రెడీ యూత్ ఫిదా అయిన `ఓజీ` ఫ్రాంచైజీని ముందుకు తీసుకెళ్లడమే బిజినెస్ పరంగా, పొలిటికల్ షెడ్యూల్స్ పరంగా పవన్‌కు కలిసి వచ్చే అంశం.
స్వయంగా పవన్ కళ్యాణ్ ఈ ఫ్రాంచైజీ నిర్మాణంలో భాగస్వామిగా ఉండటం వల్ల కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఆయనకు ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్‌లో పూర్తి నియంత్రణ ఉండటం, పైగా దర్శకుడు సుజీత్ ఎంతో ప్లానింగ్‌తో తక్కువ వర్కింగ్ డేస్‌లోనే హై-క్వాలిటీ విజువల్స్ ,విఎఫ్ఎక్స్ అవుట్‌పుట్ ఇవ్వగలగడం పవన్‌కు ప్లస్ అయింది. లౌడ్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ కంటే సుజీత్ మార్క్ స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్ వైపు ఈ తరం ప్రేక్షకులు మొగ్గు చూపడాన్ని కూడా పవన్ గమనించారు. అందువల్లే పూర్తి స్వేచ్ఛతో పనిచేసే అవకాశం ఉన్న `ఓజీ 2` వైపే పవన్ మొగ్గు చూపుతున్నారు.
అభిమానుల పరంగా చూసుకున్నా ఈ నిర్ణయం సరైనదే అనిపిస్తోంది. `ఓజీ`లో పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్, గన్ ఫైట్స్ ,ముంబై గ్యాంగ్‌స్టర్ డ్రామా ఎలిమెంట్స్ ఫ్యాన్స్ ఆకలిని పూర్తిగా తీర్చాయి. ఒక రకంగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్‌కు భంగం కలగకుండా బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసే పొటెన్షియల్ యాక్షన్ డ్రామాకే ఉంది. ఈ నేపథ్యంలోనే మిగిలిన దర్శకుల ప్రాజెక్టులను హోల్డ్‌లో పెట్టి సుజీత్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ `ఓజీ 2` కి ప్రాధాన్యత ఇవ్వడం అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతోంది.