లైన్లోకి 'OG 2'..PK32 ప‌క్క‌న బెట్టిన‌ట్లేనా?

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల లైనప్ ఎప్పుడూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గానే ఉంటుంది.

Update: 2026-06-15 09:48 GMT

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల లైనప్ ఎప్పుడూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గానే ఉంటుంది. ఆయన ఏ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఖాయం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పూర్తి ఫోకస్‌ను మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ `OG 2` పై పెట్టినట్లు క‌నిపిస్తోంది. ఈ పరిణామం అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తున‌న్నా? మరోవైపు ఆయన ఒప్పుకున్న ఇతర క్రేజీ ప్రాజెక్టుల భవితవ్యంపై నెట్టింట సరికొత్త చర్చలకు తెరలేపింది. దర్శకుడు సుజీత్ తెరకెక్కించబోతున్న `OG 2` పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

పవన్ కళ్యాణ్‌ను అత్యంత పవర్‌ఫుల్ అండ్ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా చూపించడానికి సుజీత్ పక్కా ప్లానింగ్‌తో ఉన్నారు. ఇందుకోసం ఆయన సొంత ప్రాజెక్ట్ అయిన `బ్లడీ రోమియో`ను సైతం తాత్కాలికంగా పక్కన పెట్టడం విశేషం. పవర్‌స్టార్ సినిమా కోసం సుజీత్ తన డ్రీమ్ ప్రాజెక్టును హోల్డ్‌లో పెట్టడం చూస్తుంటే `OG 2` స్కేల్ ఎంత భారీగా ఉండబోతోందో? అర్థం చేసుకోవచ్చు. అయితే `OG 2` బరిలోకి దిగడంతో పవన్ కళ్యాణ్ 32వ చిత్రంగా ప్రచారంలో ఉన్న `PK32` పై నీలినీడలు కమ్ముకున్నాయి. స్టైలిష్ డైరెక్టర్ సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

కానీ తాజా సమీకరణాల ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందా? లేక `OG 2` పూర్తయ్యాక పట్టాలెక్కుతుందా? అనే సంశయం ట్రేడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. సాధారణంగా సురేంద్ర రెడ్డి సినిమాలు హై-టెక్నికల్ వాల్యూస్.. విలక్షణమైన యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడి ఉంటాయి. ఇలాంటి భారీ సబ్జెక్ట్‌ను హ్యాండిల్ చేయడానికి దర్శకుడితో పాటు హీరో కూడా సుదీర్ఘమైన కాల్షీట్లను కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్న బిజీ పొలిటికల్ .. సినీ షెడ్యూల్స్ దృష్ట్యా, ఒకేసారి రెండు పెద్ద సినిమాలను నడపడం అసాధ్యంగా మారింది. అందుకే సురేంద్ర రెడ్డి సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఏవీ రాకపోవడం ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తుపై అనుమానాలను పెంచుతోంది.

మరో కోణంలో చూస్తే పవన్ కళ్యాణ్ కమ్‌బ్యాక్ ఇన్నింగ్స్‌లో కంటెంట్ కాంబినేషన్ల పరంగా సేఫ్ గేమ్ కంటే పవర్‌ఫుల్ ఇంపాక్ట్ ఇచ్చే సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. `OG` బ్రాండ్ ఇమేజ్ .. సుజీత్ టేకింగ్‌పై ఉన్న నమ్మకమే `OG 2` ను టాప్ ప్రయారిటీగా మార్చింది. దీనివల్ల సురేంద్ర రెడ్డి ప్రాజెక్ట్ తాత్కాలికంగా వెనక్కి వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ క్రేజీ కాంబో దాదాపు డ్రాప్ అయినట్లేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఏదేమైనప్పటికీ పవర్‌స్టార్ నుంచి వచ్చే ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. `OG 2` కోసం సుజీత్ వేరే ప్రాజెక్టును పక్కన పెట్టడం మెగా క్యాంప్‌లో జోష్ నింపిన మాట వాస్తవమే అయినా? సురేంద్ర రెడ్డి లాంటి మాస్ డైరెక్టర్‌తో ప్లాన్ చేసిన `PK32` పై అధికారిక స్పష్టత వస్తేనే అభిమానుల గందరగోళానికి తెరపడుతుంది. రాబోయే రోజుల్లో పవర్‌స్టార్ లైనప్‌పై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News