బాబాయ్ కోసం అబ్బాయ్ ప్లాన్ ఏంటి?

మెగా కుటుంబంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య ఉన్న బాండింగ్ గురించి అందరికీ తెలిసిందే.

Update: 2026-05-29 12:48 GMT

మెగా కుటుంబంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య ఉన్న బాండింగ్ గురించి అందరికీ తెలిసిందే. బాబాయ్‌ పై చరణ్‌ కు ఉన్న అభిమానాన్ని ఆయన పలుమార్లు వ్యక్తం చేశారు. ఇప్పుడు అదే బాండింగ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారింది. చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది విడుదలకు ముందే పవన్ కళ్యాణ్ కోసం స్పెషల్ ప్రీమియర్ షో ప్లాన్ చేస్తున్నారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

నిజానికి రామ్ చరణ్ చిన్నప్పటి నుంచే పవన్ కళ్యాణ్‌ ను చాలా ఇష్టపడతారని మెగా అభిమానులు అందరికీ తెలిసిందే. పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినప్పుడు చరణ్ కళ్లలో కనిపించే గౌరవం అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. పవన్ కూడా చరణ్‌ పై ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తుంటారు. మగధీర నుంచి ఇప్పటి వరకు చరణ్ కెరీర్‌ లో వచ్చిన అనేక ముఖ్యమైన సందర్భాల్లో పవన్ తన మద్దతు తెలియజేశారు.

అదే విధంగా పవన్ సినిమాలు, పొలిటికల్ జర్నీ విషయంలో చరణ్ కూడా ఎప్పుడూ అండగా నిలుస్తున్నారు. ఆ విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు పెద్ది విషయంలో కూడా బాబాయ్- అబ్బాయి బాండింగ్ మరోసారి కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఆ సినిమాను ముందుగా చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ కు చూపించాలని చరణ్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఫ్యామిలీ మెంబర్స్ అభిప్రాయం తనకు ఎంతో ముఖ్యమని భావించే రామ్ చరణ్.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రియాక్షన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన పెద్ది.. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా. గేమ్ ఛేంజర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో చరణ్ ఆ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది.

బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకుని స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు చరణ్. అభిమానుల్లో కూడా పెద్ది సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఉప్పెన తర్వాత బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ దృష్టి కూడా ఉంది. అయితే సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌ గా నటిస్తుండగా.. శివరాజ్ కుమార్, జగపతిబాబు, బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం సినిమాకు మరింత క్రేజ్ తీసుకొచ్చింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కానున్న పెద్ది కోసం ఇప్పటికే మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా విడుదలకు ముందే పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక షో ఉంటుందనే వార్తతో సోషల్ మీడియాలో మరింత హైప్ పెరిగింది. అయితే దీనిపై అఫిషియల్ అనౌన్స్మెంట్ మాత్రం ఇంకా రావాల్సి ఉంది.

Tags:    

Similar News