అన్నయ్య తొలి సినిమా రోజులను గుర్తు చేసుకుని..!
పవన్ కల్యాణ్ తన సోషల్ మీడియాలో అన్నయ్యతో అనుబంధానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసారు. నాటి విషయాలను కూడా గుర్తు చేసుకున్నారు.;
మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్ మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. సోదరుడు పవన్ కల్యాణ్ సినీనటుడిగానే కాకుండా, జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లోను రాణిస్తుడడంతో చిరు ఎమోషన్ కి హద్దే లేదు.
ఇప్పుడు అన్నయ్య తన నటనా జీవితాన్ని ఎలా ప్రారంభించారో పవన్ కల్యాణ్ గుర్తు చేసుకునే సమయం. 22సెప్టెంబర్ 2025 నాటికి చిరంజీవి నటించిన `ప్రాణం ఖరీదు` రిలీజై 47 సంవత్సరాలు పూర్తయింది. ఆరోజు చిరంజీవి ఒక సాధారణ నటుడు మాత్రమే. ఇప్పుడు ఇంతింతై అన్న చందంగా పెద్ద స్టార్ గా ఎదిగారు.
పవన్ కల్యాణ్ తన సోషల్ మీడియాలో అన్నయ్యతో అనుబంధానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసారు. నాటి విషయాలను కూడా గుర్తు చేసుకున్నారు. ప్రాణం ఖరీదు చిత్రంలో పెద్దన్నయ్య నటించినప్పటి రోజులు గుర్తున్నాయి. ఆ సమయంలో మేం నెల్లూరులో ఉన్నాం. నేను ఇంకా స్కూల్లో ఉన్నాను. మేమంతా కనకమహల్ థియేటర్‌కి వెళ్ళాము.. ఆ రోజు నేను అనుభవించిన ఆనందం మాటల్లో చెప్పలేనిది... అని గుర్తు చేసుకున్నారు.
47 ఏళ్ల సినీ ప్రయాణంలో అన్నయ్య ప్రతి అంశంలోనూ ఎంతగానో ఎదిగాడు. ఎప్పటికీ వినయంగా ఉన్నాడు.. తన సహాయ గుణాన్ని విడిచిపెట్టలేదు. దుర్గా మాత అన్నయ్యకు విజయం, ఆరోగ్యంతో నిండిన దీర్ఘ జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మునుముందు మరిన్ని వైవిధ్యమైన పాత్రలలో చూడాలని కోరుకుంటున్నాను`` అని అన్నారు. అన్నయ్య ఎప్పటికీ నటనను విరమించకూడదని కూడా పవన్ ఆకాంక్షించారు. పుట్టుక నుంచి పోరాటం చేసినవాడు.. పెద్ద అన్నయ్యను శంకర్ బాబు అని, మెగాస్టార్ చిరంజీవి అని ఆప్యాయంగా పిలుస్తాం... అని అన్నారు.