దేవర లాంటి రిస్కులోనే OG!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన ఓజీ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.;
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన ఓజీ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ముంబై బ్యాక్ డ్రాప్ తో గ్యాంగ్ స్టర్ డ్రామాగా యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా యాక్ట్ చేశారు.
ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, అభిమన్యు సింగ్, హరీష్ ఉత్తమన్ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. తమన్ మ్యూజిక్ అందించిన ఆ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించారు. అయితే భారీ అంచనాల మధ్య ఓజీ మూవీ.. నిన్న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలైంది.
సినిమాతోపాటు పవన్ కళ్యాణ్ స్వాగ్ అదిరిపోయిందని ఫ్యాన్స్ చెబుతున్నారు. సుజీత్.. తమ అభిమాన హీరోకు మంచి హిట్ ఇచ్చారని కొనియాడుతున్నారు. కానీ మిగతా సినీ ప్రియులు మాత్రం స్టోరీ విషయంలో ఇంకాస్త వర్క్ చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు. అలా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతుంటే.. సినీ లవర్స్ అప్సెట్ అయ్యారు.
అయితే ఇదే సిచ్యువేషన్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ సమయంలో కూడా నెలకొంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ.. గత ఏడాది ఇదే టైమ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న దేవర.. మిగతా సినీ ప్రియులకు ఓజీ లాగానే సాటిస్ఫై చేయలేకపోయింది.
కానీ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా రూ.500 కోట్లకు పైగానే అప్పుడు సినిమా రాబట్టింది. దీంతో అనుకున్న టార్గెట్ ను పూర్తి చేసి క్లీన్ హిట్ గా నిలిచింది దేవర. మరి ఇప్పుడు ఓజీ విషయంలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. దేవర రేంజ్ లోనే ఓజీ కూడా క్లిక్ అవుతుందో లేదో అన్నది క్వశ్చన్ మార్క్.
దేవర లాంటి రిస్కులో ఇప్పుడు ఓజీ కూడా ఉందనే చెప్పాలి. అయితే దసరా సీజన్.. థియేటర్స్ లో ఒకటే బడా సినిమా.. రిలీజ్ కు ముందే భారీ హైప్.. దీంతో ఓజీ కూడా మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని కొందరు సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. నెక్స్ట్ వీక్ లో కాంతార ప్రీక్వెల్ తప్ప మరో పెద్ద సినిమా లేదు.
ఆ సినిమాపై మంచి బజ్ ఉన్నా కూడా.. పవన్ ఫ్యాన్ బేస్ కోసం తెలిసిందే. కాబట్టి ఓజీ కూడా దేవర లాగానే బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ గా నిలుస్తోందని అంటున్నారు. మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. అప్పుడు దేవరకు అనిరుధ్ రవిచందర్.. ఇప్పుడు ఓజీకి తమన్.. మెయిన్ పిల్లర్స్ గా ఆ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు నిలవడం గమనార్హం.