అమరావతి టూ ముంబై పీకే రౌండ్లు వేయాల్సిందేనా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ `ఓజీ` షూటింగ్ కి హాజరవుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ లోనే షూటింగ్ జరుగుతుంది.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ `ఓజీ` షూటింగ్ కి హాజరవుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ లోనే షూటింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో పవన్ సెట్స్ కు వెళ్తున్నారు. వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేయాలని పవన్ కూడా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. గ్యాంగ్ స్టర్ స్టోరీ కావడంతో ముంబైలో చాలా భాగం షూటింగ్ ప్లాన్ చేసారు. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ కూడా పూర్తిచేసారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ షెడ్యూల్ అనంతరం కొత్త షెడ్యూల్ మళ్లీ ముంబైలో ప్లాన్ చేస్తున్నారుట.
దీంతో పవన్ కూడా ముంబై వెళ్లాల్సి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈవారంలోనే కేబినేట్ మీటింగ్ కూడా ఉంది. దానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పక హాజరవ్వాలి. ఈ మీటింగ్ అనంతరం పవన్ ముంబై షెడ్యూల్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. దాదాపు రెండు వారాల పాటు పవన్ టీమ్ తో ముంబైలోనే ఉంటారని సమాచారం. మధ్యలో అవసరమైతే పవన్ అమరావతికి రావాల్సి ఉంటుంది.
కేబినేట్ సమావేశంపై మళ్లి రివ్యూ సమావేశం ఉండొచ్చు. భేటీకి సంబంధించిన పనులు కూడా ప్రారంభ మవుతాయి. వాటిని కూడా పవన్ పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పవన్ ముంబై టూ అమరావతి రౌండ్లు వేయాల్సిందే. ఇప్పటికే షూటింగ్ డిలే అయిన నేపథ్యంలో ఈసారి మాత్రం ఎలాంటి ఆలస్యానికి ఛాన్స్ ఇవ్వకుండా పూర్తి చేయాలని పవన్ సైతం పట్టుదలతో ఉన్నారు.
ఇటీవలే వీరమల్లు..భగత్ సింగ్ నిర్మాతలకు పారితోషికం విషయంలో మినహాయింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమాలు ఆలస్యమైన నేపథ్యంలో అడ్వాన్సులతో సరిపెట్టుకుంటానని..బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వొద్దని ..ఆ డబ్బును సినిమాకు ఖర్చు చేసి మంచి రిలీజ్ చేసుకోమని సూచించినట్లు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.