ముంబైలో పవన్.. క్రేజ్ చూస్తే షాకే!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పటికే తాను ఒప్పుకున్న సినిమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే.;
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పటికే తాను ఒప్పుకున్న సినిమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ఆ సినిమా జూన్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
హరిహర వీరమల్లు తర్వాత.. పవన్ ఓజీ కోసం రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఆ యాక్షన్ థ్రిల్లర్ లో గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నారు పవర్ స్టార్. దీంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందోనని అటు ఫ్యాన్స్.. ఇటు సినీ ప్రియులు వెయిట్ చేస్తున్నారు.
అదే సమయంలో రీసెంట్ గా పవన్ సెట్స్ లో అడుగుపెట్టారు. ఆ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. అప్పుడే మూవీ రిలీజ్ డేట్ నూ వెల్లడించారు. సెప్టెంబర్ 25న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. దసరా స్పెషల్ గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
అయితే వీలైనంత త్వరగా మూవీ కంప్లీట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకు గాను జెట్ స్పీడ్ లో షూటింగ్ నిర్వహిస్తున్నారు. రీసెంట్ గా పవన్.. ముంబయిలో కనిపించారు. అక్కడే ప్రస్తుతం షూటింగ్ జరుగుతుండగా.. పవన్ షూటింగ్ లో పాల్గొన్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
వీడియో గ్యాంగ్ స్టర్ గెటప్ లో ఉన్న పవన్.. కారు ఎక్కుతుండగా.. ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చినట్లు కనిపిస్తున్నారు. పవర్ స్టార్ చూసి సంబరపడిపోతున్నారు. దీంతో ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతున్నారు. పవన్ క్రేజ్ అలా ఉందని, పాన్ ఇండియా రేంజ్ అని అంటున్నారు.
కాగా, సినిమాలో పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపించనున్నారు. అర్జున్ దాస్, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పై దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టనున్నారు.