ఓజి కోసం పవన్ అన్నీ పక్కన పెట్టి మరీ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాల్లో అన్నింటికంటే ఎక్కువ క్రేజ్ ఉన్న సినిమా ఓజి.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాల్లో అన్నింటికంటే ఎక్కువ క్రేజ్ ఉన్న సినిమా ఓజి. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అనౌన్స్‌మెంట్ అయినప్పటి నుంచే ఈ మూవీపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఓజి నుంచి వచ్చే ప్రతీ అప్డేట్ ఫ్యాన్స్ ను ఎంతో ఎగ్జైట్ చేస్తోంది.
అంచనాలను అందుకోలేకపోయిన వీరమల్లు
రీసెంట్ గా హరి హర వీరమల్లు సినిమాతో పవన్ కళ్యాణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆ సినిమా ఫ్యాన్స్ అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. ఏదో చాలా కాలం తర్వాత పవన్ ను స్క్రీన్ పై చూశామనే సంతృప్తి తప్పించి వీరమల్లు తో ఫ్యాన్స్ శాటిస్‌ఫై కాలేదు. దీంతో తమ ఆశలన్నింటినీ త్వరలోనే రానున్న ఓజిపైనే పెట్టుకున్నారు అభిమానులు.
ఓజి ఫస్ట్ సింగిల్‌కు భారీ రెస్పాన్స్
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది. సెప్టెంబర్ 25న ఓజి సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుండగా, రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఇప్పటికే ఫైర్ స్టార్మ్ అనే ఫస్ట్ సింగిల్ రిలీజవగా దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఓజి ప్రమోషన్స్ కు పవన్
వినాయక చవితి సందర్భంగా రెండో సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే హరిహర వీరమల్లు లానే ఓజి సినిమా ప్రమోషన్స్ కు కూడా పవన్ హాజరవనున్నట్టు తెలుస్తోంది. రిలీజ్ కు ముందు ఓ మూడు రోజుల పాటూ సినిమాను స్పెషల్ గా ప్రమోట్ చేయడానికి పవన్ ప్లాన్ చేస్తున్నారట. తన రాజకీయ కార్యకలాపాలన్నింటినీ పక్కన పెట్టి మరీ ఈ సినిమా ప్రమోషన్స్ పై పవన్ దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్ తో రూపొందించగా, ఈ సినిమాకు చాలా భారీగానే బిజినెస్ జరుగుతుందని సమాచారం.