OG: ప్రభాస్ - పవన్ కలయికపై సుజిత్ క్లారిటీ..ఏమన్నారంటే..
‘ఓజీ’తో పాటు ‘సాహో’ను కనెక్ట్ చేసే అవకాశాలపై ప్రశ్నించగా, సుజిత్ వెంటనే స్పందించారు. “ప్రభాస్ అన్న నాకు ఎంతో దగ్గరైన వ్యక్తి.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ నేడు గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది. హరిహర వీరమల్లు సినిమాతో అప్సెట్ అయిన ఫ్యాన్స్ కు OG కొన్ని సీన్స్ తో మంచి వైబ్ అయితే ఇచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే ఓపెనింగ్స్ తోనే వండర్ క్రియేట్ చేసేలా ఉంది. ప్రీమియర్ల నుంచే రికార్డు స్థాయిలో కలెక్షన్లు అందుకోవడంతో సినిమా చుట్టూ బజ్ మరింత పెరిగింది. ఈ సందర్భంగా చిత్రబృందం మీడియా ముందుకు వచ్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ ప్రెస్ మీట్‌లో దర్శకుడు సుజిత్ ఒక విషయంలో క్లారిటీ ఇచ్చే ఇచ్చే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్‌తో పని చేసిన అనుభవాలను పంచుకున్న ఆయన, భవిష్యత్తులో ‘ఓజీ’కి సంబంధించిన యూనివర్స్ ఎలా ఉండొచ్చనే అంశంపై స్పష్టతనిచ్చారు. ముఖ్యంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రభాస్ - పవన్ కలయికపై ఆయన స్పందించడం హాట్ టాపిక్‌గా మారింది.
‘ఓజీ’తో పాటు ‘సాహో’ను కనెక్ట్ చేసే అవకాశాలపై ప్రశ్నించగా, సుజిత్ వెంటనే స్పందించారు. “ప్రభాస్ అన్న నాకు ఎంతో దగ్గరైన వ్యక్తి. పవన్ కళ్యాణ్ సర్‌తో కూడా ఇప్పుడు మంచి అనుబంధం ఏర్పడింది. యూనివర్స్‌పై కొన్ని ఆలోచనలు ఉన్నాయి కానీ, ఇప్పుడే ఎలాంటి నిర్ణయాలు చెప్పలేను. ముందుగా ప్రజలు సినిమా ఎలా స్వీకరిస్తారో చూడాలి. తర్వాత మాత్రమే దాని గురించి ఆలోచిస్తాను” అని ఆయన స్పష్టం చేశారు.
అయితే, ఒకవేళ యూనివర్స్ నిజంగానే రూపుదిద్దుకుంటే, ప్రభాస్ పవన్ కలయికను బ్రదర్స్‌గా చూపించాలనే ఆలోచన ఉందని సుజిత్ హింట్ ఇచ్చారు. ఓజీలో గంభీరను సత్యదాదా దత్తపుత్రుడిగా చూపించారని, ‘సాహో’లో ప్రభాస్ రాయ్ కుమారుడిగా ఉంటారని, సత్యదాదా రాయ్ బ్రదర్స్‌గా కనెక్ట్ అవుతారని వివరించారు. ఇలాంటి లింక్ ఉంటే ఫ్యూచర్‌లో ఒక పెద్ద క్రాస్ ఓవర్ చేయవచ్చని ఆయన క్లారిటీ ఇచ్చారు.
అలాగే ‘ఓజీ’లో పోస్ట్ క్రెడిట్స్ సీన్‌ను కూడా ప్రత్యేకంగా ఉంచినట్లు దర్శకుడు చెప్పారు. “పవన్ సర్ చివర్లో నేను మళ్లీ వస్తా అని చెప్పడం యాదృచ్ఛికం కాదు. కానీ సీక్వెల్ ఎప్పుడన్నది ఇప్పుడే చెప్పలేను. ఆయన ఇప్పుడు ప్రజల నాయకుడు. కాబట్టి భవిష్యత్తు ఎలా ఉంటుందో పరిస్థితుల ఆధారంగా మారుతుంది” అని సుజిత్ తెలిపారు.
ఇక పవన్ కల్యాణ్ నటించిన జాని సినిమా తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. దానికి గౌరవంగా ఓజీలో రీమిక్స్ సాంగ్స్‌ను ఉపయోగించామని తెలిపారు. పవన్‌తో సినిమా చేయడం, అది విడుదలై హిట్ అవ్వడం తన కెరీర్‌లో మరిచిపోలేని అనుభవమని సుజిత్ ఆనందం వ్యక్తం చేశారు. మొత్తానికి, ప్రభాస్ పవన్ కలయికపై సుజిత్ ఇచ్చిన హింట్ అభిమానుల్లో కొత్త ఆశలను రేపుతోంది. నిజంగా అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ యూనివర్స్ లో సినిమా రావచ్చని అర్ధమవుతుంది.