OG లో ఆటాపాట.. నేహా చెప్పిందే రైటు..

సినిమాలో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా.. శ్రియా రెడ్డి కీలక పాత్రలో పోషించారు.;

Update: 2025-09-28 20:10 GMT

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన ఓజీ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించిన ఆ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య, కళ్యాణ్ నిర్మించారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ అందించారు.

సినిమాలో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా.. శ్రియా రెడ్డి కీలక పాత్రలో పోషించారు. అయితే వీరితోపాటు డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి సినిమాలో కనిపించనుందని కొద్ది రోజుల క్రితం జోరుగా ప్రచారం జరిగింది. స్పెషల్ సాంగ్ లో ఆమె సందడి చేయనుందని టాక్ వినిపించింది.

ఆ సమయంలో నేహా కూడా ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసి.. సర్ప్రైజ్ ఇవ్వబోతున్నానని తెలిపింది. ఆ తర్వాత బిహైండ్ ది సీన్స్ వీడియో షేర్ చేసింది. కానీ తీరా సినిమా రిలీజ్ అయ్యాక.. ఆమెకు సంబంధించిన సాంగ్ లేదు. దీంతో ఒక్కసారిగా సినీ ప్రియులు, అభిమానులు షాకయ్యారు. ఏమైందోనని మాట్లాడుకున్నారు.

ఆ విషయంపై సుజీత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. స్పెషల్ సాంగ్ గురించి ఏదైనా అనౌన్స్ మెంట్ చేశామా అంటూ తిరిగి క్వశ్చన్ చేశారు. అలా అయితే సినీ ప్రియులు.. నేహా ఎందుకు అలా చెబుతుందోనని ఆలోచించారు. ఇప్పుడు తమన్.. స్పెషల్ సాంగ్ పై క్లారిటీ ఇచ్చారు. సినిమా ఫ్లో కు నష్టం కలుగుతుందని తొలగించామని చెప్పారు.

సాంగ్ ను ఫ్రెష్ గా తీసుకురావడానికి ప్లాన్ చేశామని, సోమవారం నుంచి థియేటర్స్ వెర్షన్ కు సాంగ్ ను యాడ్ చేస్తున్నామని తెలిపారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెయిటింగ్ ఫర్ సాంగ్ అని చెబుతున్నారు నెటిజన్లు. కచ్చితంగా పాట చాలా ప్రత్యేకంగా ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. పవన్, ప్రియాంక, శ్రియా రెడ్డితోపాటు అనేక మంది నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, అభిమన్యు సింగ్, హరీష్ ఉత్తమన్, సుధేవ్, తేజ్ సఫ్రు, శుభలేఖ సుధాకర్ సహా పలువురు యాక్ట్ చేశారు. ముంబై బ్యాక్ డ్రాప్ తో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందిన ఓజీ.. ఇప్పటి వరకు రూ.200 కోట్లకు పైగా రాబట్టినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News