పవన్ OG స్పెషల్ షోస్.. నెల ముందే అడ్వాన్స్ బుకింగ్స్!
అర్జున్ దాస్, శియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమాన్యు సింగ్, అజయ్ ఘోష్, సిరి లెళ్ల ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.;
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు ఓజీ మూవీ కోసం వేయి కళ్లతో వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. కొద్ది నెలలుగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్.. ఇప్పుడు తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేస్తున్నారు. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితం ఓజీ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేశారు.
సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ లో కనిపించనున్నారు.
అర్జున్ దాస్, శియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమాన్యు సింగ్, అజయ్ ఘోష్, సిరి లెళ్ల ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఓజీ మూవీ.. సెప్టెంబర్ 25వ తేదీన దసరా కానుకగా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
అయితే ఇప్పటికే ఆడియన్స్ లో మూవీపై విపరీతమైన బజ్ ఉంది. మేకర్స్ ఇచ్చిన అప్డేట్స్ తో వేరే లెవెల్ హైప్ క్రియేట్ అయింది. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందోనని వెయిట్ చేస్తున్నారు. దీంతో ఓజీ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మేకర్స్ భారీ స్థాయిలో రిలీజ్ చేసేలా చూస్తున్నారు.
అదే సమయంలో ఓవర్సీస్ లో ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాలు భారీ ఓపెనింగ్స్ సాధిస్తున్నాయి. ఇప్పుడు ఓజీ కూడా అందుకు సిద్ధమవుతోంది. అమెరికాలో ఓజీ అడ్వాన్స్ బుకింగ్స్ ఆగస్టు 29వ తేదీన ప్రారంభమవుతున్నాయి. అంటే రిలీజ్ కు నెల రోజుల ముందే. ఈ మేరకు ఓజీ మేకర్స్ ధ్రువీకరించారు.
ప్రీమియర్స్ షోస్ కూడా వేయనున్నారు. అయితే ఇప్పుడు ఉన్న క్రేజ్ ను చూస్తుంటే మాత్రం.. అమెరికాలో ఓజీ ప్రీమియర్ షోలు పవన్ కళ్యాణ్ కెరీర్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని సినీ పండితులు చెబుతున్నారు. మరి ఓవర్సీస్ లో ఓజీ ఎలాంటి హిట్ అవుతుందో.. ఎంతటి వసూళ్లు సాధిస్తుందో.. ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.