డ్యూటీ ఎక్కిన ఓజి భామ!
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడెక్కడ చూసిన ఒకటే మాట. ఓజి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమానే ఓజి.;
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడెక్కడ చూసిన ఒకటే మాట. ఓజి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమానే ఓజి. ఫ్యాన్ బాయ్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాపై మొదటి నుంచి భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే రిలీజైన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ కూడా ఉండటంతో ఓజిపై రోజురోజుకీ అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
సెప్టెంబర్ 25న ఓజి
పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఓజి సినిమా చూస్తామా అని ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. రిలీజ్ కు మరో తొమ్మిది రోజులే ఉన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది.
ప్రమోషన్స్ ను మొదలుపెట్టిన ప్రియాంక
ప్రమోషన్స్ లో భాగంగానే హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ తో మీడియాకు ఇంటర్వ్యూలిప్పిస్తూ సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడిస్తూ ఓజిపై హైప్ ను పెంచుతున్నారు మేకర్స్. పవన్ తో ప్రియాంక చేస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా కోసం ఆమె కూడా ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ ప్రమోషన్స్ లో ప్రియాంక పవన్ ఫ్యాన్స్ కు ఓ బ్యాడ్ న్యూస్ ను చెప్పారు.
పవన్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్
రీసెంట్ గా టాలీవుడ్ లో సినిమా రిలీజ్ కు ఓ రోజు ముందు గానే ప్రీమియర్స్ వేసే ట్రెండ్ మొదలవగా, ఓజికి కూడా అలానే తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ప్రీమియర్లు వేస్తే బావుంటుందని ఫ్యాన్స్ భావించారు. కానీ ఓజి ఇంటర్వ్యూల్లో భాగంగా మేకర్స్ అలాంటివేమీ ఉండవని క్లారిటీ ఇచ్చారు. కాకపోతే సెప్టెంబర్ 25 అర్థరాత్రి 1 గంటకు, వేకువఝామున 4 గంటలకు బెనిఫిట్ షో లను వేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఆల్రెడీ ఓజిపై భారీ హైప్ ఉన్నందున మేకర్స్ ఈ సినిమాకు వేరే భాషల్లో ప్రమోషన్స్ చేస్తారో లేదో చూడాలి. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.