OG కి పవర్ స్టార్ టైం ఇస్తాడా.?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాకు విపరీతమైన ప్రమోషన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో చూపించారు.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాకు విపరీతమైన ప్రమోషన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో చూపించారు. వీరమల్లు సినిమాకు ఆ రేంజ్ బజ్ వచ్చింది అంటే అదంతా పవర్ స్టార్ వల్లే. ఐతే త్వరలో పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్ చేస్తాడా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.
ఓజీ పవన్ కళ్యాణ్..
పవన్ కళ్యాణ్ ఇక మీదట తను చేసే ప్రతి సినిమాకు ఇదే రేంజ్ ప్రమోషన్స్ చేయాలని ఫిక్స్ అయ్యారు. వీరమల్లు సినిమా 4 ఏళ్లుగా చేశామని కాదు ఒక హీరోగా సినిమా ప్రమోషన్స్ ని భుజాన వేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ రాబోతున్న ఓజీ సినిమాకు కూడా ప్రమోషన్స్ కి సిద్ధం అంటున్నారు. ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా పవన్ కళ్యాణ్ రెడీ అన్నారట.
సినిమా ప్రమోషన్స్ గా రిలీజ్ ముందు రెండు మూడు రోజులు మీడియా చిట్ చాట్ కూడా ఉంటుందని తెలుస్తుంది. సుజిత్ ఈ సినిమాను చాలా ప్లానింగ్ తో చేస్తున్నాడని తెలుస్తుంది. రిలీజ్ ఇంకా నెల రోజులే ఉన్న ఓజీ సినిమా విషయంలో ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ ఇస్తుంది. ఓజీ సినిమాలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా థమన్ మ్యూజిక్ కూడా ఉండబోతుంది.
పవర్ స్టార్ ఫ్యాన్ సుజిత్..
సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. నానితో సరిపోదా శనివారం తో సూపర్ హిట్ అందుకున్న ప్రియాంక ఓజీతో స్టార్ క్రేజ్ దక్కించుకోవాలని చూస్తుంది. పవన్ కళ్యాణ్ తో ఓజీ ప్రమోషన్స్ లో ప్రియాంక కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో ఫ్యాన్ విజిల్ మూమెంట్స్ చాలా ఉన్నాయట. సుజిత్ కూడా పీకే ఫ్యాన్ కాబట్టి అతను తెర మీద పవర్ స్టార్ ని ఎలా చూడాలని అనుకుంటున్నాడో అలా చూపిస్తాడని అంటున్నారు.
సో వీరమల్లు అంచనాలను అందుకోలేదు. నెక్స్ట్ ఓజీ తో సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్. ఫ్యాన్స్ కి ఈ మూవీపై క్రేజ్ బాగుంది. సినిమా నెల రోజుల ముందే యూఎస్ లో ఓజీ టికెట్స్ ఓపెన్ చేశారంటే సినిమా రేంజ్ ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. ఓజీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న పాన్ ఇండియా అటెంప్ట్ మీద కూడా ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.