రిలీజ్ కు ముందె ఓజీ రికార్డు.. అక్కడ పవన్ కల్యాణ్ హవా
తాజా అప్డేట్ ఏంటంటే… నార్త్ అమెరికాలో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రిలీజ్‌కు ఇంకా 10 రోజులు టైం ఉండగానే.. 50,000 ప్రీ- సేల్ టికెట్లు అమ్ముడయ్యాయి.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్ట్ చేస్తున్న OG సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినిమా లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం అయ్యింది. ఈ క్రమంలో OG అరుదైన గౌరవం సాధించింది.
తాజా అప్డేట్ ఏంటంటే… నార్త్ అమెరికాలో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రిలీజ్‌కు ఇంకా 10 రోజులు టైం ఉండగానే.. 50,000 ప్రీ- సేల్ టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో OG అక్కడ ఫాస్టెస్ట్ సెల్లింగ్ తెలుగు మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ మైలురాయిని చూసి పవర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో జోష్ పెంచేస్తున్నారు.
ఇక ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ స్పీడ్ పెంచబోతున్నారు. రేపటి నుండి అగ్రెసివ్ ప్రమోషన్స్ స్టార్ట్ అవుతాయని, ఈరోజు ఒక స్పెషల్ అప్డేట్ రానుందని టీమ్ అధికారికంగా కన్ ఫర్మ్ చేసింది. రిలీజ్ వరకు నాన్ స్టాప్ సర్ప్రైజ్ లతో అభిమానులను ఎంటర్టైన్ చేయనున్నారు.
కాగా సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. తాజాగా మేకర్స్ ఒక ఫోటో షేర్ చేశారు. పవన్ కల్యాణ్ తో షూటింగ్ స్పాట్ లో దిగిన ఫోటో అధి. సినిమా షూటింగ్ పూర్తయినట్లు ఫోటో పంచుకున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.
ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా, ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్, శామ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ సినిమాను నిర్మిస్తుండగా, థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.