పిక్‌టాక్ : ఓజీ సెట్‌లో పవన్ ఇలా..!
ఓజీ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఆన్ లొకేషన్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య ముంబైలో జరుగుతున్న షూటింగ్‌కి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.;
పవన్ కళ్యాణ్ దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌కి డేట్లు ఇస్తున్నాడు. ఇటీవలే హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‌ను ముగించిన పవన్ కళ్యాణ్ ఆ వెంటనే ఓజీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. గత రెండుళ్లుగా అభిమానులతో పాటు అందరినీ ఊరిస్తున్న ఓజీ సినిమా రెండు వారాల పాటు ముంబైలో షూటింగ్ జరిగింది. అక్కడ కీలక యాక్షన్ సన్నివేశాలతో పాటు, ముఖ్యమైన టాకీ పార్ట్‌ను సైతం షూట్ చేశారు. ప్రస్తుతం ఓజీ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ముంబై నుంచి షిప్ట్ అయిన ఓజీ యూనిట్ సభ్యులు ప్రస్తుతం స్థానికంగా వేసిన సెట్‌లో షూటింగ్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
ఓజీ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఆన్ లొకేషన్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య ముంబైలో జరుగుతున్న షూటింగ్‌కి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అందులో పవన్ కళ్యాణ్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. తాజాగా మరోసారి ఓజీ సెట్స్ నుంచి ఫోటో వచ్చింది. అయితే ఈసారి ఆ సినిమాలో నటిస్తున్న నటుడు అర్జున్ దాస్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా షేర్ చేశాడు. ఈ మధ్య కాలంలో విలన్‌గా మంచి పేరు, క్రేజ్ దక్కించుకుంటున్న నటుడు అర్జున్ దాస్. ఈయన ఓజీ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ కాంబో సీన్స్ ను అర్జున్ దాస్ చేశాడు.
పవన్ కళ్యాణ్ తో వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ను అర్జున్ దాస్ షేర్ చేశాడు. అదే సమయంలో తనకు ఎంతో ఇష్టం అయిన వ్యక్తి అంటూ పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటోలను సైతం షేర్ చేశాడు. అర్జున్ దాస్ రెండు ఫోటోలు షేర్ చేస్తే అందులో ఒకటి పవన్ కళ్యాణ్ తీసిన సెల్ఫీ కావడం విశేషం. పవన్ కళ్యాణ్ గురించి అర్జున్ దాస్ ఎక్స్‌లో... మీతో కలిసి వర్క్ చేయడం గౌరవంగా ఉంది. మీతో కలిసి వర్క్ చేసిన ప్రతి రోజును నేను గుర్తు పెట్టుకుంటాను. మీరు చాలా బిజీగా ఉన్నప్పటికీ మేము షూటింగ్ చేసినప్పుడల్లా సమయం కేటాయించారు. షూటింగ్ గ్యాప్ సమయంలో నాతో కూర్చుని మాట్లాడినందుకు కృతజ్ఞతలు. మీతో కలిసి మాట్లాడిన మాటలు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. అంతే కాకుండా మళ్లీ మీతో వర్క్ చేయాలని అనుకుంటున్నాను అంటూ అర్జున్ దాస్ ట్వీట్ చేశాడు.
ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఓజీ లో ఎలా కనిపించబోతున్నాడు అనే ప్రశ్నకు ఈ ఫోటోలు సమాధానం అంటూ అభిమానులకు సమాధానం లభించింది. పవన్ కళ్యాణ్ నటించిన వీరమల్లు సినిమా కంటే కూడా ఎక్కువగా ఓజీ సినిమాపై అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమాను సాహో సుజీత్ రూపొందిస్తున్నాడు. ఈ సినిమాను డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను దాదాపుగా రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారని టాక్. ఇదే ఏడాది చివరి వరకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.