• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్‌ వీరమల్లు కంటే ముందు...

పవన్‌ వీరమల్లు కంటే ముందు గ్యాంగ్‌స్టర్‌..!

| ఇంతకు 2025 సమ్మర్‌లో పవన్‌ నుంచి రాబోతున్న సినిమా ఏది అంటే 'ఓజీ' అనే పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

By - Tupaki Desk
Update: 2024-11-11 05:44 GMT

పవన్‌ కళ్యాణ్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ మధ్యలో ఉన్న హరి హర వీరమల్లు, ఓజీ సినిమాల షూటింగ్స్‌ను ముగించేందుకు వీలున్నప్పుడు డేట్లు ఇస్తూ వస్తున్నారు. ఇటీవల వారం రోజులు ఓజీ కోసం, మరో వారం రోజులు హరిహర వీరమల్లు సినిమా కోసం కేటాయించి షూటింగ్‌లో పాల్గొన్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలు సైతం వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎవరికి వారు తమ సినిమాను సమ్మర్‌ కానుకగా విడుదల చేస్తామని ప్రకటించారు. ఇంతకు 2025 సమ్మర్‌లో పవన్‌ నుంచి రాబోతున్న సినిమా ఏది అంటే 'ఓజీ' అనే పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

హరిహర వీరమల్లు సినిమాను సమ్మర్‌కు విడుదల చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ షూటింగ్‌ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఓజీ సినిమా షూటింగ్‌ను ముందుగా పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారట. అదే కనుక నిజం అయితే ఓజీ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటిలాగే హరి హర వీరమల్లు సినిమా విడుదల తేదీ మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఓజీ సినిమా విడుదల అయిన కొన్ని నెలల తర్వాత వీరమల్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఇప్పటికే హరి హర వీరమల్లు సినిమాను రెండు పార్ట్‌లుగా విడుదల చేయబోతున్నారనే ప్రకటన వచ్చింది. మొదటి పార్ట్‌ విడుదల తర్వాత ఓజీ ఉంటుంది, ఆ తర్వాత రెండో పార్ట్‌ ఉంటుందని ఇన్నాళ్లు ప్రచారం జరిగింది. కానీ హరి హర వీరమల్లు సినిమా విషయంలో చాలా ఆలస్యం జరుగుతుంది. భారీ ఎత్తున గ్రాఫిక్స్ వర్క్ చేయాల్సి ఉండటంతో పాటు, పవన్‌ కళ్యాణ్‌ కి సంబంధించిన సన్నివేశాలు ఇంకా చాలానే ఉన్నాయి. అందుకే ఓజీ - ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్ సినిమాతో పవన్‌ ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చి సర్‌ప్రైజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

సాహో వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఓజీ. పవన్‌ కళ్యాణ్ ను గ్యాంగ్‌స్టర్‌గా చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటూ ఉంటారు. ఫ్యాన్స్‌ ఎలా అయితే కోరుకుంటున్నారో అలా ఈ సినిమాలో సుజీత్‌ చూపించబోతున్నాడు అంటూ మేకర్స్‌ చెబుతున్నారు. పవన్‌ కళ్యాణ్ ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. రికార్డ్‌ బ్రేకింగ్‌ వసూళ్లు నమోదు అయ్యే విధంగా ఓజీ ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ప్రియాంక అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ ఇమ్రాన్‌ హస్మీ, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. తమన్‌ అందిస్తున్న సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షనగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

Tags:    
  • Hariharaveeramallu 
  • Pawankalyan 
  • Tollywood 
  • OGMovie 
  • Sujeeth 
  • Filmindustry 
  • Priyankaarulmohan 

Similar News

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

రాధిక ఆప్టే వివాదంలో చిక్కుకున్న కీర్తి సురేష్.. ఆ మాత్రం తెలియదా అంటూ ఫైర్!

2026-11-19 08:04 GMT

టార్గెట్ రీచ్ అయితే న‌య‌న్ రిటైర్మెంట్ ఇచ్చేస్తుందా?

2026-11-19 07:58 GMT

బీనా త్రిపాఠి గతం వెనుక విషాద ప్రేమకథ!

2026-11-19 07:56 GMT

తమన్నా టాలెంట్ కి ఆడియన్స్ ఫిదా.. భలే కలిసొస్తోందే?

2026-11-19 07:55 GMT

టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. హిట్ల వెనుక సీక్రెట్ ఫార్ముల?

2026-11-19 07:55 GMT

Copyright @2026

Powered by Blink CMS