OG: ఆ సీన్ థియేటర్స్‌ను దద్దరిల్లేలా చేస్తుందట!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న భారీ సినిమాల్లో ఓజీ టాక్ మొదటి స్థానంలో ఉంది.;

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న భారీ సినిమాల్లో ఓజీ టాక్ మొదటి స్థానంలో ఉంది. స్టార్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ గ్యాంగ్‌స్టర్ డ్రామా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఊహించని స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ మాఫియా తరహా గెటప్‌లో, స్టైలిష్ యాక్షన్ అవతారంలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, మ్యూజిక్ క్లిప్, లుక్స్ అన్నీ ఈ హైప్‌కు నిదర్శనంగా నిలిచాయి.
ఇటీవల బజ్ ప్రకారం ఈ సినిమాలో ఒక సీన్.. ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందని అంటున్నారు. అది ఏంటంటే.. రెండు గ్యాంగ్‌స్టర్ గ్రూపుల మధ్య జరగబోయే ఒక డెడ్లీ ఫేస్ ఆఫ్. ఈ సీన్ మధ్యలో OG ఎంట్రీ ఇవ్వడం, పవన్ స్క్రీన్ ప్రెజెన్స్, ఫైటింగ్ స్టైల్, డైలాగ్ డెలివరీ.. అన్నీ కలిపి మాస్ మేనియాను తలపిస్తాయట. ఆ సీన్ గురించి 100% ఊహించుకుంటే.. పవన్ కళ్యాణ్ స్క్రీన్ లో కనిపించేది దాన్ని మించి 200% అనిపించేదిగా ఉంటుంది అని ఇంటర్నల్ యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఒక్క సీన్ గురించి నెట్టింట్లో ఫ్యాన్స్ ఇప్పటికే థియరీలు వేసుకుంటున్నారు. ఈ సీన్ పిక్చరైజేషన్లో డార్క టోన్, స్లో మోషన్ యాక్షన్, తుఫాన్ లాంటి BGM, OG వాక్.. అన్నీ కలిపి తలదన్నేలా ఉంటాయని టాక్. ఇదే సీన్ సినిమాకు టర్నింగ్ పాయింట్ అవుతుందట. ఎక్కడికక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సీన్ రిలీజ్ తర్వాత థియేటర్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇక OG సినిమాపై ఈ మధ్య మరికొన్ని ఆసక్తికర అప్డేట్స్ వచ్చాయి. షూటింగ్ తుది దశలో ఉంది. థమన్ అందించిన BGM ఇప్పటికే టీజర్‌కు పెద్ద ప్లస్ అయింది. ఈ సినిమాను దాదాపు అన్ని ప్రధాన భారతీయ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. ఎమోషన్, స్టైల్, మాస్, కల్ట్ అనేది OG సినిమా టోన్గా కనిపిస్తోంది.
మొత్తానికి ఈ రెండు గ్యాంగ్ గ్రూపుల మధ్య OG ఎంట్రీ సీన్ గురించి ఇప్పుడు నుంచే చర్చ మొదలైంది. అభిమానులకు ఓ స్పెషల్ ట్రీట్‌గా నిలవబోయే ఈ సీన్, సినిమా విడుదల తర్వాత ఫ్యాన్ సెలబ్రేషన్లకు ఫోకస్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి OG సినిమా పవన్ కెరీర్లో మరో భారీ సినిమాగా మారుతుందా.. అన్నది రిలీజ్ తర్వాత తెలుస్తుంది.