అప్‌కమింగ్ ప్రాజెక్టులు.. అసలు పవన్ ప్లాన్ ఏంటి?
2026లో ఇప్పటివరకు పవన్ కొత్త సినిమా ఏదీ సెట్స్ పైకి వెళ్లకపోవడం గమనార్హం.
ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ పెట్టారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. దీంతో ఆయన అప్ కమింగ్ మూవీలపై ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొన్నా, ప్రస్తుతం కొత్త ప్రాజెక్టుల విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ కనిపించడం లేదు. 2026లో ఇప్పటివరకు పవన్ కొత్త సినిమా ఏదీ సెట్స్ పైకి వెళ్లకపోవడం గమనార్హం.
డిప్యూటీ సీఎంగా కీలక శాఖల బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ తరచూ మీటింగ్స్, విజిట్స్ తోపాటు పీపుల్ ఈవెంట్స్ తో బిజీగా గడుపుతున్నారు. అదే సమయంలో తన జనసేన పార్టీని మరింత స్ట్రాంగ్ గా మార్చడం, ఫ్యూచర్ పొలిటికల్ స్ట్రాటజీపై ఆయన దృష్టి పెట్టినట్లు క్లియర్ గా తెలుస్తోంది. అందుకే సినిమాల విషయంలో కాస్త తక్కువ సమయం కేటాయిస్తున్నట్లు అర్థమవుతోంది.
కానీ పవర్ స్టార్ ను మళ్లీ స్క్రీన్ పై చూడాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో వస్తున్న పలు వార్తలు వైరల్ చేస్తున్నారు. రీసెంట్ గా పవన్ కొత్త సినిమాలకు సంబంధించి వస్తున్న రూమర్లకు చెక్ పడింది. ప్రస్తుతం పవన్ ఎలాంటి కొత్త చిత్రాలకు సంతకం చేయలేదని, వెంటనే కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే ప్లాన్ లేదని ఆయన సొంత బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ క్లారిటీ ఇచ్చింది.
కానీ ఇప్పటికే ప్రకటించిన ప్రాజెక్టులు సంగతేంటి? పవన్ ప్లాన్ ఏంటి? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఓకే చేసిన ప్రాజెక్టులు పవన్ ఇప్పటికే కంప్లీట్ చేయగా.. అవి రిలీజ్ కూడా అయ్యాయి. ఆ తర్వాత సినిమాలు చేయరేమోనని అంతా అనుకున్నారు. కానీ అందులో ఒక మూవీ ఓజీకి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ లో నటిస్తున్నట్లు పవన్ హింట్ ఇచ్చారు.
దీంతో పవన్ సినిమాలు కంటిన్యూ చేస్తారని ఫిక్స్ అయ్యారు. ఇంతలో సురేందర్ రెడ్డితో మూవీ అనౌన్స్ చేశారు. వక్కంతం వంశీ ఆ సినిమాకు కథ అందిస్తున్నారు. అయితే ఆ ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభమవుతుందని గతంలో వార్తలు వచ్చినా, ఇప్పటివరకు షూటింగ్ కు సంబంధించిన అప్డేట్ రాలేదు. ఓజీ-2 పరిస్థితి కూడా అంతే. ప్రీ ప్రొడక్షన్ పనులు అవుతున్నాయని తెలుస్తున్నా.. ఎలాంటి క్లారిటీ లేదు.
అవన్నీ ఒకెత్తు అయితే.. నిర్మాతగా కూడా చురుగ్గా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ గతంలో ప్రకటించారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ద్వారా పలు ప్రాజెక్టులపై చర్చలు జరిగినప్పటికీ, ఇప్పటివరకు స్టార్ట్ అవ్వలేదు. దీంతో అసలు పవన్ ప్లాన్ ఏంటి? ఏం చేయనున్నారు? అంటూ డిస్కస్ చేసుకుంటున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆయన.. కొత్త సినిమాలు ఎందుకు మొదలు పెట్టడం లేదంటూ మాట్లాడుకుంటున్నారు.
అయితే రీసెంట్ గా పవన్ కు కాస్త హెల్త్ బాలేదు. ఇటీవల ఆపరేషన్ కూడా జరిగింది. దాని వల్ల ఇప్పుడు సినిమాలపై దృష్టి పెట్టడం లేదని తెలుస్తోంది. అదే సమయంలో రాజకీయ బాధ్యతలు ఎక్కువగా ఉండటంతో మూవీలకు పూర్తి సమయం కేటాయించడం సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే అనౌన్స్ చేసిన ప్రాజెక్టులు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. దీంతో అభిమానుల్లో ఒకే ప్రశ్న వినిపిస్తోంది.. అసలు పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటనేది!