• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీరమల్లు.. మరోసారి పవన్...

వీరమల్లు.. మరోసారి పవన్ యాక్షన్ టాలెంట్!

| టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-04-17 07:20 GMT

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఆ పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఆ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

అయితే హరిహర వీరమల్లు సినిమాకు గాను ఇప్పటికే పవన్ కళ్యాణ్.. తన సింగింగ్ టాలెంట్ ను మరోసారి బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన పాడిన సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరో విషయం రివీల్ అయింది. పవన్.. సినిమా కోసం యాక్షన్ కొరియోగ్రఫీ చేశారట.

ఆ విషయాన్ని డైరెక్టర్ జ్యోతి కృష్ణ రీసెంట్ గా తెలిపారు. సినిమాలో ఒక యాక్షన్ సీక్వెన్స్ ను రూపొందించే బాధ్యతను పవన్ తీసుకున్నారని చెప్పారు. మూవీలో ఆరు సీక్వెన్స్ లు ఉన్నాయని పేర్కొన్నారు. అందులో 20 నిమిషాల పాటు సాగే సీక్వెన్స్ ను పవన్ రూపొందించారని.. అది సినిమాకు ఎంతో స్పెషల్ అని అన్నారు.

హైదరాబాద్ లోని ప్రైవేట్ స్టూడియోలో 61 రోజుల పాటు షూట్ చేశామని, 1100 మంది పాల్గొన్నారని, పవన్ ఎంతో కష్టపడ్డారని తెలిపారు. గ్రౌండ్ వర్క్ చేసి.. ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్ తో డిస్కస్ చేశారని చెప్పారు. మూవీకి అదే హైలెట్ అని చెప్పి అంచనాలు పెంచారు. ప్రస్తుతం జ్యోతి కృష్ణ కామెంట్స్.. నెట్టింట వైరల్ గా మారగా.. పవన్ హార్డ్ వర్క్ ను అంతా కొనియాడుతున్నారు.

మూవీ పట్ల డెడికేషన్ అంటే అది అని కామెంట్లు పెడుతున్నారు. మరోసారి పవన్ టాలెంట్ ను విట్నెస్ చేయనున్నామని చెబుతున్నారు. అదే సమయంలో జ్యోతి కృష్ణ.. సినిమా కోసం పగలు, రేయి కష్టపడుతున్నారని తెలుస్తోంది. ఆయనతోపాటు నిర్మాత ఏ ఎం రత్నం కూడా దగ్గరుండి మూవీ వర్క్స్ ను పర్యవేక్షిస్తున్నారని సమాచారం.

ఇప్పటికే అనౌన్స్ చేసిన మే 9 రిలీజ్ డేట్ ను చేరుకోవాలని శతవిధాల ట్రై చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో మేకర్స్ మూవీ కోసం బాగానే కష్టపడుతున్నారన్నమాట. అయితే చెప్పిన తేదీకి సినిమా రిలీజ్ అయ్యే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే మేకర్స్ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయలేదు. కానీ మేకర్స్ మాత్రం పనులు కంప్లీట్ చేస్తున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    
  • PawanKalyan 
  • HariHaraVeeraMallu 
  • PowerStar 
  • Tollywood 
  • SouthCinema 
  • IndianCinema 
  • PawanKalyanFans 
  • JyothiKrishna 
  • HHVM 
  • ActionMovie 
  • BehindTheScenes 
  • WarSequence 

Similar News

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS