ఇక్కడ ఒకే...మరి అక్కడ ఎప్పుడు పవన్ జీ!
ఈ గ్యాప్ లో అటెన్షన్ తప్పకుండా ఏదో విషయం చెబుతూ టీమ్ కూడా మ్యానేజ్ చేసుకుంటూ వచ్చింది. అలాగని ఇంకెంత కాలం మ్యానేజ్ చేయగలరు.;
ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' షూటింగ్ షురూ చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం నుంచి చివరి షెడ్యూల్ మొదలవ్వడంతో చిత్రీకరణకు హాజరవుతున్నారు. హైదరాబాద్లో ప్రత్యేకంగా వేసిన సెట్లో దర్శకుడు జ్యోతికృష్ణ నేతృత్వంలో రెండు రోజుల పాటు చిత్రీకరణ జరుగుతుంది. ఇందులో పవన్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అంటే మరికొన్ని గంటల్లో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.
అనంతరం 6వతేదిన గుమ్మడికాయ కొట్టేస్తారు. అటుపై కొత్త రిలీజ్ తేదీని ప్రకటిస్తారు. ఇలా వీరమల్లు గట్టెక్కిసినట్లే. మరి 'ఓజీ' సంగతేంటి? అంటే ఉలుకు పలుకు లేకుండా కనిపిస్తుంది. కొన్ని నెలలుగా ఆ సినిమా మేకర్స్ కూడా పవన్ రాక కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇదిగో వస్తు న్నాను..అదిగో వస్తున్నాను అనే మాట తప్ప ఆయన రావడం మాత్రం కనిపించలేదు.
ఈ గ్యాప్ లో అటెన్షన్ తప్పకుండా ఏదో విషయం చెబుతూ టీమ్ కూడా మ్యానేజ్ చేసుకుంటూ వచ్చింది. అలాగని ఇంకెంత కాలం మ్యానేజ్ చేయగలరు. వాళ్లు కూడా కొన్ని రోజులుగా సైలెంట్ గా నే ఉంటు న్నారు. ఆయన వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్న ధీమాకి వచ్చేసారు. అయితే వీరమల్లు పూర్తయిన నేపథ్యం లో పవన్ 'ఓజీ'కి కూడా డేట్లు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాకు పవన్ చాలా రోజులు డేట్లు కేటాయించాలి.
హైదరాబాద్ సహా ముంబైలో కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించాలి. పవన్ డేట్లు ఇస్తే టీమ్ తో పాటే కొన్ని రోజులు ఉండాలి. మధ్యలో రాజకీయం అంటూ అమరావతి రావడానికి వీలుండదు. ఇవన్నీ చూసుకుని పవన్ ఓజీకి డేట్లు కేటాయించాల్సి ఉంది. మరి దీనికి సంబంధించి రెండు..మూడు రోజుల్లో కొత్త అప్ డేట్ ఏదైనా వస్తుందేమో చూడాలి.