రాజు గారికి పవన్ ఛాన్స్ ఇస్తారా?

దర్శకుడు అనిల్ రావిపూడితో ఈ ప్రాజెక్ట్ ను నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇది మెసేజ్ ఓరియంటేటెడ్ సోషల్ డ్రామాగా ఉండనుందని అంటున్నారు.;

Update: 2025-10-12 08:30 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న సినిమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. గత మూడు నెలల్లో హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలతో థియేటర్లలో సందడి చేశారు. ఇక ఇప్పటికే ఒప్పుకున్న సినిమాల్లో బాకీ ఉంది ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రమే. ఈ సినిమాకు సంబంధించిన తన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసేశారు. మేకర్స్ ఫైనల్ షెడ్యూల్ కూడా నిన్ననే ప్రారంభించారు. నవంబర్ ఆఖరి వారంలో ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అవుతుందని అంటున్నారు. ఈ లెక్కన వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ఇది థియేటర్లలోకి వచ్చేస్తుంది.

దీంతో అందరి కళ్లన్నీ పవన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పైనే ఉన్నాయి. ఐదేళ్లుగా తాను ఒప్పుకున్న మూడు సినిమాలు కంప్లీట్ చేశారు. ఇక ఎలాంటి సినిమా చేస్తారు? ఎప్పుడు చేస్తారు? డైరెక్టర్ ఎవరు? అనే ప్రశ్నలు పవర్ స్టార్ ఫ్యాన్స్ మదిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనతో సినిమాలు చేసేందుకు పలువురు దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు కథలు కూడా వినిపించారని సమాచారం. కానీ, పవన్ ఇంకా ఏదీ ఫైనల్ చేయలేదు.

ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కామెంట్లు వైరల్ గా మారాయి. పవన్ లేటెస్ట్ సినిమా ఓజీ స్పెషల్ స్క్రీనింగ్ లో పాల్గొన్న దిల్ రాజు.. తాను పవన్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. అంటే ఆయనతో సినిమా తీయాలని అనుకుంటున్నానని చెప్పేశారు. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన వకీస్ సాబ్ కరోనా కారణంగా రికార్డులు కొట్టలేకపోయిందని, అందుకే పవన్ తో పక్కా మరో సినిమా చేస్తానని అన్నారు.

దర్శకుడు అనిల్ రావిపూడితో ఈ ప్రాజెక్ట్ ను నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇది మెసేజ్ ఓరియంటేటెడ్ సోషల్ డ్రామాగా ఉండనుందని అంటున్నారు. అయితే ఈ కొలాబరేషన్ పై పవన్ ఫ్యాన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. హను రాఘవపూడి, వెంకీ అట్లూరీ, పూరీ జగన్నాథ్ లాంటి డైరెక్టర్లతో పవన్ సినిమా ప్లాన్ చేయాలని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

పవన్ - దిల్ రాజు బంధం ఇప్పటిది కాదు. తొలి ప్రేమ సినిమా రోజుల నుంచే ఆయనతో దిల్ రాజుకు బంధం ఏర్పడింది. ఈ సినిమాను దిల్ రాజు అప్పట్లో నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేశారు. అలాగే అజ్ఞాతవాసి ఫెయిల్యూర్ తర్వాత పవన్ కమ్ బ్యాక్ ఇచ్చిన వకీల్ సాబ్ సినిమాను తమ బ్యానర్ పైనే నిర్మించారు. మరి పవన్ దిల్ రాజుకు డేట్లు ఇస్తారా? ఆయనతో ఇంకో సినిమా చేస్తారా? అనేది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.

Tags:    

Similar News