ఓజి.. ఓ ప‌నైపోయింది

అనౌన్స్‌మెంట్ తోనే భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేసిన ఓజీ సినిమా షూటింగ్ ను సుజీత్ చాలా ప్రీ ప్లాన్డ్ గా ప్లాన్ చేసుకున్నాడు.;

Update: 2025-06-08 05:26 GMT

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం త‌న చేతిలో ఉన్న సినిమాల‌ను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు. మొన్న‌టికి మొన్న ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు షూటింగ్ ను పూర్తి చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్, ఇప్పుడు తాజాగా సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఓజి సినిమాను పూర్తి చేశాడు. వాస్త‌వానికి ఈ రెండు సినిమాల షూటింగులు ఎప్పుడో పూర్త‌వాల్సింది.

కానీ ఏపీ ఎల‌క్ష‌న్స్ త‌ర్వాత పవ‌న్ డిప్యూటీ సీఎం అయి, ప్ర‌భుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ బిజీగా మారాడు. దీంతో సినిమాల‌కు స‌మ‌యం కేటాయించే ప‌రిస్థితులు రాలేదు. అన్నీ చూసుకుని త‌న కాల్షీట్స్ ను క‌మిట్ అయిన సినిమాల‌కు కేటాయించి, వాటిని పూర్తి చేయ‌డానికి ఇంత టైమ్ ప‌ట్టింది. ఇక ఓజీ సినిమా విష‌యానికొస్తే ఈ సినిమా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెరకెక్కుతుంది.

అనౌన్స్‌మెంట్ తోనే భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేసిన ఓజీ సినిమా షూటింగ్ ను సుజీత్ చాలా ప్రీ ప్లాన్డ్ గా ప్లాన్ చేసుకున్నాడు. అందుకే ప‌వ‌న్ డేట్స్ ఇచ్చిన‌న్ని రోజులు చాలా ఫాస్ట్ గా ఓజీ షూటింగ్ ను పూర్తి చేశాడు. కానీ పవ‌న్ పాలిటిక్స్ లో బిజీగా మారడంతో ఆ సినిమా షూటింగ్ ను ఆపేయాల్సి వ‌చ్చింది. రీసెంట్ గా ప‌వ‌న్ ఓజీ కోసం డేట్స్ ను కేటాయించ‌గా తిరిగి సినిమా షూటింగ్ ను మొద‌లుపెట్టి దాన్ని పూర్తి చేశాడు.

ప్యాక‌ప్ ఫ‌ర్ గంభీర‌.. గేరప్ ఫ‌ర్ ది రిలీజ్ అంటూ ఈ మేరకు నిర్మాణ సంస్థ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ గంభీరా అనే పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబ‌ర్ 25న ద‌స‌రా సంద‌ర్భంగా రిలీజ్ కానుంద‌ని మేక్ర్స్ ఇప్ప‌టికే అనౌన్స్ చేశారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుగుతున్నాయి.

ప్రియాంక అరుళ్ మోహ‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమాలో ఇమ్మాన్ హ‌ష్మీ విల‌న్ గా న‌టిస్తున్నాడు. ముంబై నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ స్టైలిష్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ షూటింగ్ పూర్తైంద‌ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్ట‌ర్ లో ప‌వ‌న్ ర‌క్తంతో త‌డిచిన చేతుల‌తో క‌నిపిస్తున్నాడు. దీన్ని బ‌ట్టి చూస్తుంటే ఓజీలో యాక్ష‌న్ సీన్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉండబోతున్నాయ‌ని తెలుస్తోంది. డీవీవీ ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ లో డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్న ఈ సినిమాకు త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.

Tags:    

Similar News