ఖుషి కాంబో చూసే ఛాన్స్ ఉందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా ఆయన ఫ్యాన్స్ కి ఆల్ టైం ఫేవరేట్ మూవీస్ లో ఒకటని చెప్పొచ్చు.;

Update: 2025-09-16 04:13 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా ఆయన ఫ్యాన్స్ కి ఆల్ టైం ఫేవరేట్ మూవీస్ లో ఒకటని చెప్పొచ్చు. ఎస్.జె సూర్య డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ సరసన భూమిక హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా తర్వాత అందులోని సీన్స్ రిఫరెన్స్ గా తీసుకుని ఎన్నో యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ వచ్చాయి. ఖుషి అనేది లవ్ స్టోరీస్ సినిమాల్లో ఒక బెంచ్ మార్క్ గా నిలిచింది. అప్పటికీ ఇప్పటికీ ఆ సినిమాలోని సీన్స్, సాంగ్స్ అన్నీ పవర్ స్టార్ ఫ్యాన్స్ కి హాట్ ఫేవరెట్ గా ఉన్నాయి.

పవన్ భూమిక జోడీ చూడాలని..

ఐతే కొన్ని కాంబినేషన్స్ మళ్లీ చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఆశిస్తారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో ఖుషి లాంటి హిట్ కొట్టిన భూమిక మళ్లీ ఆయనతో జత కట్టలేదు. దానికి రీజన్స్ తెలియదు కానీ మళ్లీ తెర మీద పవన్ భూమిక జోడీ చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఖుషి కాంబో మళ్లీ కలిసి నటిస్తే చూడాలని అందరు కోరుతున్నారు. కానీ దానికి పాజిబిలిటీస్ చాలా తక్కువ అన్నట్టే అనిపిస్తుంది.

పవన్ కళ్యాణ్ ఈమధ్య సినిమాలనే చాలా సెలెక్టెడ్ గా చేస్తున్నారు. ఇక మరోపక్క భూమిక సినిమాలు పెద్దగా చేయట్లేదు. భూమిక హీరోయిన్ గా నటించకపోయినా కూడా జస్ట్ పవన్ సినిమాలో అలా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో కనిపించినా కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉంటుంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఈ జంట మీద చాలా ఆసక్తిగా ఉన్నారు.

విజయ్ దేవరకొండ ఖుషి టైటిల్ తో..

ఖుషి కాంబినేషన్ లో సినిమా వస్తే ఆ జోష్ వేరేలా ఉంటుంది. ఎస్.జె సూర్య ఆల్రెడీ ఖుషి సీక్వెల్ స్టోరీ రాయడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారు. కానీ అలాంటి కథకు సీక్వెల్ అంటే కాస్త టైం తీసుకోవాలి. అంతేకాదు ఖుషి లాంటి కథ మళ్లీ సెట్ అవ్వాలంటే మళ్లీ అద్భుతం జరగాలి. ఎందుకంటే అలాంటి కథలు ఇప్పుడు యూత్ ఫుల్ హీరోస్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ రెండేళ్ల క్రితం ఖుషి టైటిల్ తో సినిమా చేశాడు. సమంత హీరోయిన్ గా నటించింది. శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా జస్ట్ ఓకే అనిపించుకుంది. ఖుషి టైటిల్ మీద విజయ్ దేవరకొండ మీద పవర్ స్టార్ ఫ్యాన్స్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఐతే ఖుషి లాంటి సూపర్ హిట్ టైటిల్ ని వాడుకుని ఆ రేంజ్ సక్సెస్ ని మాత్రం అందుకోలేదు విజయ్ దేవరకొండ. పవర్ స్టార్ ఖుషి 2 ఉండే ఛాన్స్ లేకపోయినా ఆ ఊహే ఎంత బాగుందో అనుకుంటున్నారు ఫ్యాన్స్.

Tags:    

Similar News