అజ్ఞాతవాసి కాంబోకు మరో ఛాన్స్?.. పవన్ ఫ్యాన్స్ కొత్త డిమాండ్!

అయితే ఇదే సమయంలో అభిమానుల అభిప్రాయాలు పూర్తిగా ఒకే దిశలో లేవు. మరో వర్గం మాత్రం పవన్ సినిమాలకు త‌మ‌న్‌నే కంటిన్యూ చేయాల‌ని కోరుతోంది.

Update: 2026-07-04 16:30 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాలపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజకీయాలు, సినిమాలను సమాంతరంగా కొనసాగిస్తున్న పవన్, ఇకపై చేసే ప్రతి ప్రాజెక్ట్‌లోనూ ఏ డైరెక్ట‌ర్, ఏ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఉంటారనే అంశాలపై సోషల్ మీడియాలో డిస్క‌ష‌న్ జరుగుతోంది. తాజాగా అలాంటి చర్చల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు అనిరుధ్ రవిచందర్.

X లాంటి సోషల్ మీడియా వేదికల్లో పలువురు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్‌కు మరోసారి అనిరుధ్ తో క‌లిసి సినిమా కావాల‌ని పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా పవన్ చేయబోయే సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్‌కు అనిరుధ్ సంగీతం అందిస్తే మాస్ ఎలివేషన్స్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్తాయని వారు అభిప్రాయపడుతున్నారు. అనిరుధ్ అందించే ఎనర్జిటిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పవన్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు సరైన బూస్ట్ అవుతుందని కామెంట్లు చేస్తున్నారు.

ఈ డిస్క‌ష‌న్ లో మ‌రో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే.. గతంలో పవన్ కళ్యాణ్- అనిరుధ్ కాంబినేషన్‌లో వచ్చిన అజ్ఞాతవాసి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. సినిమా భారీ నిరాశను మిగిల్చినప్పటికీ, అందులోని కొన్ని పాటలు, అనిరుధ్ అందించిన సంగీతానికి మాత్రం అప్పట్లో మంచి రెస్పాన్స్ లభించింది. అందుకే ఒక సినిమా ఫలితాన్ని బట్టి ఈ కాంబినేషన్‌ను పూర్తిగా అంచనా వేయడం సరికాదని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇదే కారణంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకసారి మిస్సైన మ్యాజిక్‌కు మరో అవకాశం ఇవ్వాల‌నే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. సరైన కథ, మంచి డైరెక్ట‌ర్, భారీ కమర్షియల్ ట్రీట్‌మెంట్ ఉంటే పవన్- అనిరుధ్ కాంబినేషన్ ఈసారి పూర్తిగా భిన్నమైన ఫలితాన్ని ఇవ్వగలదని పలువురు పోస్టులు చేస్తున్నారు. గతాన్ని పక్కనబెట్టి కొత్త ఆరంభానికి ఇదే సరైన సమయమని కూడా కొందరు పేర్కొంటున్నారు.

అయితే ఇదే సమయంలో అభిమానుల అభిప్రాయాలు పూర్తిగా ఒకే దిశలో లేవు. మరో వర్గం మాత్రం పవన్ సినిమాలకు త‌మ‌న్‌నే కంటిన్యూ చేయాల‌ని కోరుతోంది. ఇటీవల పవన్ నటించిన పలు సినిమాల‌కు త‌మ‌న్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అభిమానులను ఆకట్టుకున్నాయని, హీరో మాస్ ఇమేజ్‌ను ఆయన బాగా అర్థం చేసుకుంటారని వారు వాదిస్తున్నారు. ఇప్పటికే పవన్‌తో మంచి అనుబంధం ఏర్పడిన త‌మన్‌ను మార్చాల్సిన అవసరం లేదని కూడా సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి.

మొత్తంగా చూస్తే పవన్ కళ్యాణ్ తర్వాతి సినిమాల్లో మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎవర‌నే అంశం ఇప్పుడు అభిమానుల్లోనే ఆసక్తికర చర్చగా మారింది. ఒకవైపు అనిరుధ్‌తో మరోసారి కలిసి పనిచేయాలని కోరుతున్నవారు ఉంటే, మరోవైపు త‌మన్‌నే కంటిన్యూ చేయాల‌ని కోరుతున్న ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ రెండు కాంబినేషన్లపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ డిస్క‌ష‌న్స్ అభిమానుల అంచనాలను మాత్రమే ప్రతిబింబిస్తున్నాయి. ఫైన‌ల్ డెసిష‌న్ మాత్రం రాబోయే రోజుల్లో మేక‌ర్ల అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్స్ తోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News