పెళ్లయిన 13 ఏళ్లకు మామ్ అవుతున్న హీరోయిన్
తనదైన అందం, నట ప్రతిభతో మెప్పించిన టాలీవుడ్ హీరోయిన్ పార్వతి మెల్టన్ ఇటీవల సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే.;
తనదైన అందం, నట ప్రతిభతో మెప్పించిన టాలీవుడ్ హీరోయిన్ పార్వతి మెల్టన్ ఇటీవల సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లోని `జల్సా` చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న పార్వతి మెల్టన్, అంతకుముందు దేవకట్టా `వెన్నెల` చిత్రంలోను అద్బుత నటనతో ఆకట్టుకుంది. నటన, డ్యాన్సుల్లో ప్రతిభావనిగా గుర్తింపు తెచ్చుకున్నా కానీ, కొన్ని ఫ్లాప్ చిత్రాలు పార్వతి కెరీర్ ని ఇబ్బందుల్లోకి నెట్టాయి.
అయితే నటిగా కెరీర్ జర్నీ అంతంత మాత్రంగానే సాగుతున్న సమయంలో పార్వతి మెల్టన్ అకస్మాత్తుగా ఒక బిజినెస్ మేన్ ని పెళ్లి చేసుకుని పరిశ్రమకు దూరమైంది. 2012లో సినిమాలు వదిలేసి అమెరికా వ్యాపార వేత్త షంసు లాలానీని పార్వతి పెళ్లాడేసింది. అయితే పెళ్లయిన 13 ఏళ్లయినా ఇన్ని రోజులు శుభవార్త ఏదీ అందలేదు. ఇప్పటికి తన గర్భధారణ గురించి అధికారికంగా ప్రకటించి శుభవార్తను అందించింది పార్వతి మెల్టన్.
గత కొద్దిరోజులుగా పార్వతి తన బేబి బంప్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ అందరికీ టచ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం పార్వతి మెల్టన్ తల్లవుతున్న ఆనందంలో షేర్ చేస్తున్న ప్రతి ఫోటో, వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా మరో కొత్త ఎడిషన్ ఫోటోషూట్ ని పార్వతి షేర్ చేసింది. ఈసారి ఫ్రెగ్నెంట్ ఉమెన్ గా ఉన్న పార్వతి ప్రఖ్యాత కెల్విన్ క్లెయిన్ (సీకే) ఇన్నర్ దుస్తులను ధరించి, బ్రాండ్ ప్రచారం చేయడం ఆశ్చర్యపరిచింది. పార్వతి వైట్ అండ్ వైట్ ఇన్నర్ లు ధరించి పొద్దుతిరుగుడు పూల తోటలో కెమెరాకు ఫోజులిచ్చింది. పార్వతి సూక్ష్మంలో మోక్షాన్ని ప్లాన్ చేసిందని ఈ ఫోటోగ్రాఫ్స్ చూశాక కొందరు కామెంట్లు చేస్తున్నారు. మెటర్నిటీ ఎడిటోరియల్, ఫ్రెగ్నెన్సీ గ్లో, బాలీవుడ్ ఎడిటోరియల్, టాలీవుడ్ స్టార్ లెట్ వంటి పదాలకు హ్యాష్ ట్యాగుల్ని జోడించి పార్వతి మెల్టన్ వాటిని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.