డిప్రెషన్ తో నటిలో సూసైడ్ ఆలోచనలు!
నేటి బిజీ జీవితం చాలా ఒత్తిళ్లమయం. ఇది రంగుల పరిశ్రమకు వర్తిస్తుంది. ఇక్కడ పని చేసే స్టార్లు, సాంకేతిక నిపుణుల జీవితాల్లో ఒత్తిళ్లు చాలా సహజం.;
నేటి బిజీ జీవితం చాలా ఒత్తిళ్లమయం. ఇది రంగుల పరిశ్రమకు వర్తిస్తుంది. ఇక్కడ పని చేసే స్టార్లు, సాంకేతిక నిపుణుల జీవితాల్లో ఒత్తిళ్లు చాలా సహజం. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ప్రభావితం చేసే తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్య. స్టార్ల విషయానికి వస్తే కొందరు బహిరంగంగా తమ ఒత్తిడి గురించి ఓపెనయ్యారు.దీనివల్ల ప్రజలు మానసిక ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడేందుకు ఆస్కారం ఉందనేది ఒక భావన.
సక్సెస్ లేదా కీర్తి, డబ్బుతో సంబంధం లేకుండా ఎవరైనా డిప్రెషన్ సవాళ్లను అనుభవించ వచ్చనేందుకు చాలా ఉదాహర ణలున్నాయి. తాజాగా మాలీవుడ్ నటి పార్వతి తిరువోతు తన అనుభవాలను పంచుకుంది. చెప్పుకోలేని బాధ, విపరీతమైన ఆలోచనలతో ఇబ్బందిపడినప్పుడు మానసిక చికిత్స తీసుకోవడం చాలా అవసరమంది.తాను డిప్రెషన్ కు గురైనప్పుడు థెరపీ ద్వారా నయం చేసుకున్నానంది. 'కరెక్ట్ థెరపిస్ట్ దొరకడానికి చాలా సమయం పట్టింది. మొదట్లో అమెరికన్ థెరపిస్టులను కలిసాను. అర్దరాత్రి పూట వారు నాతో మాట్లాడేవారు. వారితో సాధ్యపడదని తెలుసుకుని స్థానిక థెరపిస్టులను కలిసాను.
వారు నా సమస్య ఏంటి? అన్నది గుచ్చి గుచ్చి మరీ అడిగి తెలుసుకున్నారు. అప్పటికే నేను తీవ్రమైన ఒంటరి తనంతో బాదపడుతున్నాను.సూసైడ్ ఆలోచనలు బుర్రంతా చుట్టుముట్టాయి. నా చుట్టూ ఏం జరుగుతుందో అర్దం కాలేదంది. 'బుర్ర పగిలిపోయినట్లు అనిపించేది. 2021 ఏడాదిలో ఈ రకమైన ఇబ్బందితో బాగా బాధపడ్డాను. ఆసంవత్సరం గుర్తొస్తోనే భయమేస్తుంది. ప్రత్యేకించి జనవరి, ఫిబ్రవరి నెల అంటే టెన్షన్ కి గురవుతాను. అప్పటి నుంచి ఆ రెండు నెలలు అంటే ఆందోళన కూడా కలుగుతుందని తెలిపింది.
ఇప్పుడింత ఆరోగ్యంగా ఉన్నాను అంటే ? కారణం సరైన సమయంలో సరైన థెరపిస్టులు ఇచ్చిన వైద్యం కారణంగానే డిప్రెషన్ నుంచి కోలుకున్నాను అని తెలిపింది. పార్వతి తిరువోతు సినిమాల విషయానికి వస్తే అమ్మడు 'బెంగుళూరు డేస్' సినిమాతో బాగా ఫేమస్ అయింది. 'ఎన్ను నింటే' , 'మొయిద్దీన్','చార్లీ ఉయర్', 'వైరస్', 'పుళు' లాంటి చిత్రాలతోనూ మంచి విజయాలు అందుకుంది. ప్రస్తుతం కన్నడ పరిశ్రమలో బిజీగా ఉంది. టాలీవుడ్ లో ప్రయత్నాలు చేస్తోంది గానీ సరైన అవకాశాలు రావడం లేదు. ఆ మధ్య ఓ యంగ్ హీరో సినిమాకు ఎంపికైందని ప్రచారం జరిగింది గానీ మళ్లీ ఎలాంటి అప్ డేట్ రాలేదు. దీపికా పదుకొణే, పరిణితో చోప్రా, ఇలియానా, అమీర్ ఖాన్, ఆయన కుమార్తె, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్లు సహా చాలా మంది సెలబ్రిటీలు డిప్రెషన్ బారిన పడిన వాళ్లే.