మందు గ్లాసుతో దొరికిపోయిన పాలక్ తివారీ
బాలీవుడ్ లో పార్టీ కల్చర్ గురించి ఇప్పుడే పరిచయం చేయాల్సిన పని లేదు. కరణ్ జోహార్ లాంటి ప్రముఖులు ప్రత్యేకించి ఇంట్లోనే ఇండస్ట్రీ ప్రముఖుల కోసం విందు వినోదాలను అందిస్తారు.;
బాలీవుడ్ లో పార్టీ కల్చర్ గురించి ఇప్పుడే పరిచయం చేయాల్సిన పని లేదు. కరణ్ జోహార్ లాంటి ప్రముఖులు ప్రత్యేకించి ఇంట్లోనే ఇండస్ట్రీ ప్రముఖుల కోసం విందు వినోదాలను అందిస్తారు. హిందీ పరిశ్రమలో పాశ్చాత్యధోరణులు, అలవాట్ల గురించి ఇప్పటికే చాలా పెద్ద చర్చ సాగింది.
ఇక జెన్ జెడ్ గురించి చెప్పేదేం ఉంటుంది? ఇలాంటి అలవాట్లలో యువనటీనటులు ఇంకా స్పీడ్ గా ఉన్నారు. ఇప్పుడు బాలీవుడ్ నటి శ్వేతా తివారీ గారాల పట్టి పాలక్ తివారీ చేతిలో మందు(ఆల్కహాల్) గ్లాస్ తో చిల్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో గుబులు పెంచేసింది. అయితే ఈ బ్యూటీకి మద్యపానం అలవాటు ఉందా? అంటే గత ఇంటర్వ్యూల ప్రకారం.. తనకు మద్యం తాగే అలవాటు లేదు.
మద్యం ముట్టనని పాలక్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. స్నేహితులతో పార్టీలకు వెళ్లినప్పుడు కూడా అందరూ డ్రింక్స్ తీసుకుంటుంటే, తను మాత్రం కేవలం `సూప్` తాగుతూ ఎంజాయ్ చేస్తానని సరదాగా చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉంటానని కూడా అన్నారు.
అయితే ఇక్కడ దృశ్యం మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని ఇప్పుడు నెటిజనులు పాలక్ ని తప్పు పడుతున్నారు. బయటకు చెప్పుకునేది ఒకటి, కానీ ఆచరించేది ఇంకొకటి అంటూ కొందరు విరుచుకుపడుతున్నారు. పాలక్ ఇలా మందు గ్లాసుతో కొంటెగా ఫోజులివ్వడమే కాదు..``జనవరి`` అంటూ సింపుల్ పదాన్ని జోడించింది. దీని అర్థం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టగానే తాను ఫుల్ జోష్‌లోకి వెళ్లిపోయానని చెప్పడమే. అయితే తనకు ఆల్కహాల్ అలవాటు లేదని చెప్పి ఇప్పుడిలా దొరికిపోయింది సదరు స్టార్ కిడ్.
పాలక్ లైఫ్ స్టైల్ - ఇతర అలవాట్లు:
పాలక్ తన లైఫ్ స్టైల్ గురించి గతంలో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. డ్రింక్స్ మ్యాటర్ అటుంచితే, తనకు స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా పానీపూరి, చాట్ వంటి ఐటమ్స్ ఎక్కడ కనిపించినా వదలరట. జంక్ ఫుడ్ (బర్గర్లు, పాస్తా) కూడా ఇష్టంగా తింటారు.
వారానికి కనీసం 5 రోజులు జిమ్‌కి వెళ్తారు. తన తల్లి శ్వేతా తివారీకి సహజంగానే ఫిట్‌నెస్ ఉందని, కానీ తాను మాత్రం కష్టపడి వర్కౌట్లు చేయాల్సి ఉంటుందని పాలక్ చెబుతుంటారు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడం, డ్యాన్స్ చేయడం ఈ క్యూటీకి ఇష్టమైన వ్యాపకాలు. అలాగే చర్మ సౌందర్యం కోసం ఆర్గానిక్ ఉత్పత్తులను వాడటానికి ప్రాధాన్యత ఇస్తారు. తన తల్లి చాలా పొదుపుగా ఉంటుందని, తనను విలాసవంతమైన వస్తువుల వైపు మళ్లించడానికి తానే ప్రయత్నిస్తుంటానని పాలక్ ఒక ఇంటర్వ్యూలో సరదాగా వ్యాఖ్యానించారు.
పాలక్ సల్మాన్ ఖాన్ చిత్రం `కిసీ కా భాయ్ కిసీ కీ జాన్` (2023) తో ఆమె బాలీవుడ్ వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. గత ఏడాది విడుదలైన `ది భూత్నీ`లో సంజయ్ దత్, మౌనీ రాయ్ లాంటి సీనియర్ తారలతో కలిసి నటించింది. రోమియో S3 లో ఠాకూర్ అనూప్ సింగ్‌తో కలిసి నటించింది. ఈ రెండు సినిమాలు పాలక్ కి యూత్‌లో ఫాలోయింగ్ పెంచాయి. ఇటీవల కొన్ని క్రేజీ మల్టీస్టారర్లలో నటించింది. 2026లో పలు చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. `రోజీ: ద సాఫ్రాన్ చాప్టర్` పాలక్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం. వివేక్ ఒబెరాయ్, అర్బాజ్ ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ హర్రర్ థ్రిల్లర్ 2026 లో విడుదలయ్యే అవకాశం ఉంది.