మాస్ మహారాజ్‌తో మిల్కీ బ్యూటీ రీయూనియన్?
టాలీవుడ్‌లో మాస్ మహారాజ్‌గా అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రవితేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు.;
టాలీవుడ్‌లో మాస్ మహారాజ్‌గా అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రవితేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఆయన ఇప్పుడు మరో ఆసక్తికరమైన సినిమాతో వార్తల్లో నిలుస్తున్నారు. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఇరుముడి అనే సినిమాలో రవితేజ నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి చర్చకు దారితీసింది. ఈ సినిమాకు సంబంధించిన తాజా బజ్ ఇప్పుడు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.
బెంగాల్ టైగర్ లో కలిసి నటించిన రవితేజ- తమన్నా
సినీ వర్గాల్లో వినిపిస్తున్న బజ్ ప్రకారం, ఈ సినిమాలో కీలక పాత్ర కోసం మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పేరుని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఈ వార్త నిజమైతే, చాలా కాలం తర్వాత రవితేజ, తమన్నా జోడీ మళ్లీ తెరపై కనిపించే అవకాశం ఉంటుంది. వీరిద్దరూ ఇంతకు ముందు బెంగాల్ టైగర్ సినిమాలో కలిసి నటించి ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో వీరి కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ రావడంతో, మళ్లీ ఈ జంట స్క్రీన్‌పై కనిపిస్తే ఫ్యాన్స్ కు మరో ట్రీట్‌గా మారే అవకాశముంది.
పాన్ ఇండియా స్థాయిలో తమన్నాకు క్రేజ్
ప్రస్తుతం తమన్నాకు పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఇటీవల ఆమె వివిధ భాషల్లో చేస్తున్న ప్రాజెక్ట్‌లు, అలాగే ఓటీటీ మరియు కమర్షియల్ సినిమాల్లో కనిపిస్తున్న పాత్రలు ఆమెకు మరింత గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో ఆమె ఇరుముడి ప్రాజెక్ట్‌లో భాగమైతే, ఆ క్రేజ్ సినిమాకు అదనపు బలం అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
హీరోయిన్ గా ప్రియ భవానీ శంకర్
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. భారీ స్థాయి కమర్షియల్ సినిమాలను తెరకెక్కించడంలో ఈ బ్యానర్‌కు ఉన్న అనుభవం దృష్ట్యా ఇరుముడి కూడా భారీ స్థాయిలో రూపొందే అవకాశముంది. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు జి.వి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆయన సంగీతం ఇప్పటికే అనేక భాషల్లో మంచి ఆదరణ పొందింది. అందువల్ల ఈ సినిమాకు మ్యూజిక్ కూడా ఒక ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
డైరెక్టర్ శివ నిర్వాణ తన సినిమాల్లో ఎమోషన్స్ కు ఎక్కువ ప్రాధాన్యమిస్తారనే పేరుంది. కుటుంబ సంబంధాలు, ప్రేమ, భావోద్వేగాలు కలిసిన కథలను ఆయన ప్రత్యేకమైన శైలిలో తెరకెక్కిస్తారు. అదే స్టైల్‌ను కొనసాగిస్తూ ఇరుముడి సినిమాను కూడా మంచి ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఓ వైపు తన స్టైల్ లో ఎమోషన్స్ ను మేళవిస్తూనే, మరో వైపు రవితేజకు సరిపోయే మాస్ ఎలిమెంట్స్ కూడా ఉండేలా కథను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద స్టార్ కాస్ట్, క్రేజీ కాంబినేషన్, ప్రముఖ బ్యానర్ కలవడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక తమన్నా కూడా ఈ ప్రాజెక్టులో జాయిన్ అయితే, ఇరుముడిపై ఆసక్తి మరింత పెరగడం ఖాయమని చెప్పాలి. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.