సీనియర్ ఎన్టీఆర్ తో సంచలన డైరెక్టర్ బాండింగ్!
కోలీవుడ్ డైరెక్టర్ వి. వాసు గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో హిట్ చిత్రాలు అందించారు.;
కోలీవుడ్ డైరెక్టర్ వి. వాసు గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో హిట్ చిత్రాలు అందించారు. హారర్ థ్రిల్లర్ లో తనదైన ముద్ర వేసారు. `చంద్రముఖి` సినిమాతో ఆయన పేరు టాలీవుడ్ లోనూ బాగా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. తెలుగులో కూడా `మహారధి`, `కృష్ణార్జున`, `కథానాయకుడు`, `నాగవల్లి` లాంటి చిత్రాలు తెరకెక్కించారు. అయితే ఇవేవి పెద్దగా ఆడలేదు. అలాగే కన్నడలో కూడా కొన్ని సినిమాలు డైరెక్ట్ చేసారు.
నటుడిగా కూడా చాలా సినిమాలు చేసారు. రైటర్ గాను ఆయన రాణిస్తున్నారు. అయితే పి.వాసు ఇండస్ట్రీ లోనే పుట్టి పెరిగారు? అన్నది మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. ఈయన తండ్రి పీతాంబరన్ అప్పట్లో పెద్ద మ్యాకప్ ఆర్టిస్ట్. శ్రీన్టీఆర్ , ఎంజీఆర్ లకు మేకప్ మెన్ గా సుదీర్గ కాలం పని చేసారు. తాజాగా తన తండ్రి కి ఎన్టీఆర్ చేసిన సహాయం గురించి పి. వాసు తొలిసారి ఓపెన్ అయ్యారు.
ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... `నాన్నగారు మేకప్ మెన్ గా పనిచేస్తూనే సినిమాలు నిర్మించేవారు. నాన్న నిర్మించిన శ్రీ అనే సినిమా అంటే బాగా ఇష్టం. ఆసినిమా కోసం 6 నెలలు గడువు పెట్టి ఇల్లు తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఆరు నెలల తర్వాత డబ్బు కట్టకపోతే ఇల్లు పోతుంది. ఆ ఇల్లు సెంటిమెంట్ కావడంతో నాన్న టెన్షన్ పడుతున్నారు. ఈ విషయం ఎంజీఆర్ గారికి తెలిసింది. దీంతో వెంటనే ఆయన మా బ్యానర్లో సినిమా చేయడానికి డేట్లు ఇచ్చారు.
వచ్చిన డబ్బుతో ఇల్లు విడిపించుకోమన్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు మా ఊరు వచ్చారు. మీకు , మాకు ఎప్పటి నుంచో అనుబంధం ఉంది కదా ? నాకు ఒక్క మాటైనా చెప్పకూడదా అన్నారు. నాతో సినిమా చేసుకోండి డేట్స్ ఇస్తానన్నారు. అలా చేసిన సినిమానే `అన్నదమ్ముల అనుబంధం`. ఎన్టీఆర్ లేకపోతే ఆ సినిమా లేదు. ఇల్లు లేదు` అన్నారు.