• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఓటీటీ బిజినెస్.. పెద్ద...

ఓటీటీ బిజినెస్.. పెద్ద సినిమాలకే అసలు దెబ్బ

| ఇక ఓటీటీ అనేది నిర్మాతలకు మొన్నటి వరకు ఒక జాక్ పాట్ లాగా ఉండేది.

By - Tupaki Desk
Update: 2024-03-02 13:30 GMT

ఒకప్పుడు కేవలం థియేట్రికల్ బిజినెస్ పైనే ఆధారపడిన నిర్మాతలు ఇప్పుడు నాన్ థియట్రికల్ గా కూడా భారీ స్థాయిలోనే లాభాలు అందుకుంటూ ఉన్నారు. పెట్టిన పెట్టుబడి వెనక్కి రావాలి అంటే ఇప్పుడు డిజిటల్ రైట్స్ అనేవి చాలా ముఖ్యంగా మారాయి. సినిమాకు మంచి బజ్ ఉంటే విడుదలకు ముందే మంచి రేట్లకు అమ్ముడవుతున్నాయి. ఇక ఓటీటీ అనేది నిర్మాతలకు మొన్నటి వరకు ఒక జాక్ పాట్ లాగా ఉండేది.

అయితే ఇప్పుడు ఉన్న పోటీ ప్రపంచంలో పెద్ద సినిమాలకు మాత్రం ఓటీటీ షరతులు వల్ల కొంత ప్రభావం కూడా పడుతోంది. ఏమాత్రం తేడా వచ్చినా కూడా భారీ స్థాయిలో అటువైపు నుంచి వచ్చే ఆదాయం తగ్గుతోంది. ఈ విషయంలో జాగ్రత్తగా లేకపోతే మాత్రం మొదటికే మోసం వచ్చేలా కనిపిస్తోంది. మునుపటి లాగా ఓటీటీ సంస్థలు కూడా ఎలా పడితే అలా సినిమాలను కొనుగోలు చేయడం లేదు.

వెనక ముందు ఆలోచించుకునే డీల్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు. దానికి తోడు వారికి కూడా లిమిట్స్ ఉంటాయి. ఒక ఏడాదిలో ఇంత మొత్తంలోనే సినిమాలపై పెట్టుబడి పెట్టాలి అని ఒక టార్గెట్ కూడా పెట్టుకున్నారు. ఇక అది కూడా పెద్ద సినిమాలకు కొంత ఎఫెక్ట్ చూపిస్తోంది. ఏడాది చివరిలో వచ్చే కొన్ని సినిమాలను ఓటీటీ సంస్థలు అడిగినంత రేటు ఇచ్చి కొనుగోలు చేయడం లేదు. ఎందుకంటే అప్పటికే ఒక ఏడాదిలో చేయాలనుకున్న ఇన్వెస్ట్ మెంట్స్ టార్గెట్ ఫినిష్ అవుతోంది.

అంతేకాకుండా ఇటీవల కాలంలో ఓటీటీ సంస్థల నుంచి పెద్ద సినిమాలు కోల్పోతున్న ఆఫర్లకు అన్ని ఇన్ని కావు. అది కూడా సిల్లీ రీజన్స్ వల్లే డీల్స్ క్యాన్సిల్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. లేదంటే రేట్లు కూడా అమాంతంగా తగ్గించేస్తున్నారు. సినిమాను అనుకున్న సమయానికి పూర్తిచేసి విడుదల చేయకపోతే ఓటీటీ యాజమాన్యాలు అసలు ఒప్పుకోవడం లేదు. చెప్పిన సమయం కన్నా ఎక్కువ సమయం తీసుకుని దర్శకులు మేకింగ్ విధానంలో చేస్తున్న పొరపాట్లు సినిమా విడుదలకు ఆలస్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి.

దీనివల్ల ఓటీటీ సంస్థల్ల నుంచి ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఒకప్పుడు అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్న ఓటీటీ సంస్థలు ఇప్పుడు మాత్రం అందుకు సిద్ధపడటం లేదు. చెప్పిన సమయానికి సినిమా విడుదల చేసి ఆ తరువాత అనుకున్న డేట్ కు లేదంటే ముందుగానే ఓటీటీలో విడుదల చేయాల్సింది అనేలా డీల్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక సినిమాల విడుదల డేట్స్ వాయిదా పడితే మాత్రం ముందుగా అనుకున్న రేట్ల విషయంలో తేడాలు వచ్చేస్తూ ఉన్నాయి. దీంతో పెద్ద సినిమాల రేట్లు తగ్గించక తప్పడం లేదు. దీన్ని బట్టి దర్శకులు కాస్త పక్క ప్రణాళికతో ఆలోచించి సినిమాలను అనుకున్న సమయానికి పూర్తిచేస్తే బెటర్ అనే కామెంట్స్ వస్తున్నాయి.

Tags:    
  • OTT 
  • Ottcompanies 
  • Producers 
  • Netflic 
  • Disney 
  • Amazonprime 
  • Zee5 

Similar News

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS