#గుసగుస‌.. మ‌డాక్‌తోనే మ‌డ‌త పేచీలా?

'స్త్రీ 2' స‌హా ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌ను అందించిన మ‌డాక్ ఫిలింస్ త‌మ బ్యాన‌ర్ లో రూపొందించిన ఓ మూడు సినిమాల‌ను ఓటీటీల‌కు విక్ర‌యించేందుకు ప్లాన్ చేస్తోంది.;

Update: 2025-05-15 03:15 GMT

దిగ్గ‌జ ఓటీటీలు భార‌త‌దేశంలో వినియోగ‌దారుల‌ను పెంచుకునేందుకు పోటీప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే పోటీ ఎంత‌ ఉన్నా కానీ, నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపించ‌డంలోను ఓటీటీల ద‌మన నీతి, తెలివితేటలు ఇటీవ‌ల చ‌ర్చ‌కు తెర‌లేపాయి.

'స్త్రీ 2' స‌హా ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌ను అందించిన మ‌డాక్ ఫిలింస్ త‌మ బ్యాన‌ర్ లో రూపొందించిన ఓ మూడు సినిమాల‌ను ఓటీటీల‌కు విక్ర‌యించేందుకు ప్లాన్ చేస్తోంది. దానికోసం చ‌ర్చ‌లు సాగుతున్నాయి. కానీ ఓ ప‌ట్టాన బేరం తెగ‌డం లేద‌ని తెలుస్తోంది. ఓటీటీలు మ‌డ‌త పేచీ పెడుతూ ఆశించిన డ‌బ్బును చెల్లించేందుకు స‌సేమిరా అనేస్తున్నాయ‌ట‌. దీంతో మ‌డాక్ ఫిలింస్ ఆ సినిమాల రిలీజ్ ల‌ను వాయిదా వేస్తోంది. ఇటీవ‌లే భూల్ చుక్ మాఫ్ విడుద‌ల వాయిదా ప‌డి ఓటీటీలో రిలీజ్ కి లైన్ క్లియ‌రైంది. ఇదే గాక‌.. పూజా మేరీ జాన్, రూమి కి షరాఫత్, సర్వగుణ్ సంపన్న వంటి చిత్రాల‌ను ఓటీటీలో రిలీజ్ చేయాల్సి ఉంది.

ఏడాది కాలంగా ఈ సినిమాలు అన్ని ప‌నులు పూర్తి చేసుకుని త‌మ‌తో ఉన్నాయ‌ని దినేష్ విజ‌న్ అన్నారు. ఓటీటీలతో డీల్ కుద‌ర‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే ఇవి రిలీజ్ కాలేద‌ని వివ‌రించారు. దినేష్ విజ‌న్ డిమాండ్ చేస్తున్న మొత్తం చాలా పెద్ద‌ది అని ఓటీటీలు భావిస్తున్నాయ‌ట‌. అయితే ఈ మూడు సినిమాల కంటెంట్ పై నిర్మాత‌కు మంచి న‌మ్మ‌కం ఉంది. అందుకే ఆల‌స్య‌మైనా మంచి ధ‌ర‌కు అమ్ముకోవాల‌ని వేచి చూస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే డీల్ పూర్త‌యి, ఇవ‌న్నీ విడుద‌ల‌వ్వాల‌ని మ‌డాక్ ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.

Tags:    

Similar News