• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పరీక్షల కాలంలో.. వరుణ్...

పరీక్షల కాలంలో.. వరుణ్ తేజ్ ఆపరేషన్

| అసలైతే ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ మళ్ళీ ఎందుకో వెనక్కి తగ్గారు. ఇక ఇప్పుడు మార్చి ఒకటవ తేదీన పెద్దగా పోటీ లేకుండా రంగంలోకి దిగుతున్నారు.

By - Tupaki Desk
Update: 2024-02-03 14:26 GMT

మెగా హీరో వరుణ్ తేజ్ బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ సక్సెస్ అందుకొని చాలా కాలం అయింది. అప్పుడెప్పుడో వచ్చిన ఫిదా తొలిప్రేమ సినిమాలతోనే అతనికి మార్కెట్లో మంచి డిమాండ్ అయితే ఏర్పడింది. ఇక తర్వాత చేసిన ఏ సినిమా కూడా భారీ స్థాయిలో అయితే సక్సెస్ కాలేదు. మధ్యలో వచ్చిన గద్దలకొండ గణేష్ పరవాలేదు అనే విధంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ అందుకుంది.

ఇక తర్వాత ఎఫ్3 కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. అయినప్పటికీ అది మల్టీస్టారర్ సినిమా. ఇక సోలో సక్సెస్ కోసం వరుణ్ తేజ్ చాలా కాలంగానే ఎదురు చూస్తూ ఉన్నాడు. కదల స్టైల్ మారుతున్నా కూడా బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా డిజాస్టర్స్ ఎదురవుతున్నాయి. గని గాండీవ దారి అర్జున రెండు సినిమాలు కూడా దారుణంగా నష్టాలను కలిగించాయి.

అయితే నెక్స్ట్ సినిమాతో మాత్రం సాలిడ్ సక్సెస్ అందుకోవాలి అనే విధంగా వరుణ్ తేజ్ ఆలోచిస్తున్నాడు. అతని నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్స్. తెలుగు హిందీలో ఒకేసారి ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇప్పటివరకు అయితే అనుకున్నంత స్థాయిలో అంచనాలు క్రియేట్ కాలేదు. ప్రమోషన్స్ కంటెంట్ కూడా పెద్దగా క్రేజ్ పెంచడం లేదు.

అసలైతే ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ మళ్ళీ ఎందుకో వెనక్కి తగ్గారు. ఇక ఇప్పుడు మార్చి ఒకటవ తేదీన పెద్దగా పోటీ లేకుండా రంగంలోకి దిగుతున్నారు. ఇది సోలో డేట్ అయినప్పటికీ కూడా ఆడియోన్స్ ను థియేటర్స్ కు రప్పించడం చాలా కష్టమైన పని. టీనేజ్ తో పాటు యువత ఎగ్జామ్స్ తో చాలా బిజీగా ఉంటారు.

ఇక ఫ్యామిలీ ఆడియన్స్ అంతగా ఆసక్తి చూపించకపోవచ్చు. కాబట్టి ఇది సినిమాకు పెద్ద పరీక్ష అని చెప్పవచ్చు. ఈ టైంలో సక్సెస్ అందుకోవడం సాధారణమైన విషయం కాదు. కాబట్టి టాక్ మాత్రం చాలా బలంగా పాజిటివ్ గా ఉండాలి. ఇటీవల ఇదే బ్యాక్ డ్రాప్ లో వచ్చిన బాలీవుడ్ ఫైటర్ మూవీ దారుణంగా డిజాస్టర్ అయింది. రెండో రోజుకే సినిమా కలెక్షన్స్ దారుణంగా తగ్గిపోయాయి. ఇక ఇప్పుడు అదే టచ్ తో రాబోతున్న వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.


Tags:    
  • Tollywood 
  • Varuntej 
  • Manushichillar 
  • Operationvalentine 
  • Operationvalentinemovie 
  • Releasedate 
  • Filmmakers 
  • Filmindustry 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS