OG 'సువ్వి సువ్వి' సాంగ్.. హార్ట్ టచింగ్ మెలోడిగా..

తమన్ స్వరపరిచిన ఈ గీతాన్ని శృతి రంజని తన మధుర గానంతో మరింత అందంగా ఆవిష్కరించారు. ఆలాగే కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని రాసిన సాహిత్యం పాటకు మరింత ఫీల్ ను తీసుకొచ్చింది.;

Update: 2025-08-27 06:19 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా అది అభిమానుల్లో ఉండే హడావుడి చాలా స్పెషల్ గా ఉంటుంది. ప్రజలకు సేవ చేసే నాయకుడిగా బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు ఫ్యాన్స్ కు కిక్కిచ్చేలా చేస్తున్న ఓజీ సినిమా మీద అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ సినిమా కోసం మేకర్స్ విడుదల చేస్తున్న ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇప్పటికే ఫైర్ స్టార్మ్ అనే మొదటి సింగిల్‌తో సినిమా మాస్ బజ్ తెచ్చుకుంది. తమన్ కంపోజ్ చేసిన ఆ సాంగ్ థియేట్రికల్ ఫీల్ కలిగిస్తూ అభిమానులను ఉర్రూతలూగించింది. ఇప్పుడు అదే సినిమా నుంచి విడుదలైన రెండవ పాట సువ్వి సువ్వి పూర్తిగా భిన్నమైన అనుభూతిని కలిగిస్తోంది. హృదయాలను హత్తుకునేలా సాగిన ఈ మెలోడీ, పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక మధురమైన సర్‌ప్రైజ్‌గా మారింది.

తమన్ స్వరపరిచిన ఈ గీతాన్ని శృతి రంజని తన మధుర గానంతో మరింత అందంగా ఆవిష్కరించారు. ఆలాగే కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని రాసిన సాహిత్యం పాటకు మరింత ఫీల్ ను తీసుకొచ్చింది. ప్రతి లైన్ హత్తుకునేలా ఉండటంతో, ఈ పాటను అభిమానులు రిపిటేడ్ గా వింటారని చెప్పాలి. మాస్ బీట్‌లకు తోడుగా ఇలాంటి మెలోడీల్లో కూడా తన మ్యాజిక్ ను చూపించడం తమన్ ప్రత్యేకత.

సాంగ్‌లో పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంట తెరపై కొత్త ఫ్రెష్‌నెస్‌ను అందించారు. ఈ జంట హైలైట్‌గా నిలుస్తుందని యూనిట్ అంతా నమ్మకం వ్యక్తం చేస్తోంది. లిరికల్ వీడియోలో ఇద్దరి కెమిస్ట్రీ ఇప్పటికే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక సినిమా కాస్టింగ్ కూడా భారీ స్థాయిలో ఉంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస వంటి టాప్ టెక్నీషియన్స్ కెమెరా వర్క్ అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్నారు.

ప్రతీ విభాగంలోనూ టాప్ నిపుణులు పనిచేయడంతో ఓజీ ఒక గ్రాండ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ అవుతుందనే నమ్మకం ఉంది. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతున్న ఓజీ, ఇప్పటినుంచే అంచనాలను హై లెవెల్ కు చేర్చింది. ఫైర్ స్టార్మ్ తర్వాత సువ్వి సువ్వి మెలోడీ విడుదల కావడం, సినిమాకు మాస్‌ క్లాస్ కలయికని చూపిస్తోంది. అభిమానులు ఇప్పుడు మరిన్ని అప్‌డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి రానున్న అప్డేట్స్ ఏ రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తాయో చూడాలి.

Full View
Tags:    

Similar News