OG-2ను సుజీత్ అలా ప్లాన్ చేస్తున్నారా?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో ఓజీ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే.;

Update: 2025-09-28 20:10 GMT

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో ఓజీ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ముంబై బ్యాక్ డ్రాప్ తో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందిన ఆ సినిమా సందడి బుధవారం ప్రీమియర్స్ తో భారీ ఎత్తున ప్రారంభమైంది. గురువారం నాడు ప్రపంచవ్యాప్తంగా మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే సినిమా చివర్లలో ఓజీ-2 అనౌన్స్మెంట్ మాత్రం థియేటర్లలో పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందనే చెప్పాలి. మూవీ లాస్ట్ లో OG 2 – COMING SOON అంటూ సుజీత్ వేసిన టైటిల్ కార్డు చూసి అంతా షాకయ్యారు. థియేటర్లలో కేకలు, చప్పట్లతో అభిమానులు ఆ అనౌన్స్‌మెంట్ ను హార్ట్ ఫుల్ గా స్వాగతించారు.

దీంతో ఓజీ రెండో భాగం కోసం సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా తెగ చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కథ గురించి ఒక్కొక్కరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఓ ఇంటర్వ్యూలో రీసెంట్ గా ఓజీ సెకండ్ పార్ట్ కోసం మాట్లాడారు. ఆ సినిమా.. సీక్వెల్ లేదా ప్రీక్వెల్ అని అడగ్గా.. ఇంకా డిసైడ్ అవ్వలేదని తెలిపారు.

ఆ తర్వాత ప్రీక్వెల్, సీక్వెల్ ను రెండింటినీ షూట్ చేసి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు పరోక్షంగా తెలిపారు. దీంతో ఇప్పుడు సుజీత్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ ను కంప్లీట్ చేసిన పవన్.. మళ్లీ రంగంలో దిగాక తొలుత ఓజీ 2కే డేట్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

వెయిటింగ్ ఫర్ మూవీ అని ఇప్పటి నుంచే చెబుతున్నారు. ఆ సినిమా మరింత యాక్షన్‌ తో, ఎమోషన్‌ తో, ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉండనుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే స్టోరీని కూడా సుజీత్ చాలా వరకు సిద్ధం చేసుకుని ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. స్టోరీ కూడా ఇదే ఉండొచ్చని కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఓజీలో హీరో 15 ఏళ్లు అజ్ఞాతవాసంలో ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత చెన్నైలో ఉన్నట్లు చూపిస్తారు. దీంతో ఓజీలో హీరో పాత్ర మిస్సయిన ఏడేళ్ల కాలాన్ని ఇప్పుడు సెకండ్ పార్ట్ లో మెయిన్ ప్లాట్ గా తీసుకుంటారని చెబుతున్నారు. జపాన్ కు వెళ్లి పగ తీర్చుకోవడం.. మళ్లీ ముంబై వచ్చి మాఫియా ఎదుర్కోవడాన్ని చూపిస్తారని వినికిడి.

Tags:    

Similar News