• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మిస్ వ‌ర‌ల్డ్ పోటీలో...

మిస్ వ‌ర‌ల్డ్ పోటీలో ఓడినా ఇండ‌స్ట్రీలో గెలుపు ఖాయం!

| అవ‌న్నీ మిస్ ఇండియా వరల్డ్ 2022 టైటిల్‌ను గెలుచుకున్న సినీ శెట్టిలో పుష్క‌లంగా ఉన్నాయంటే అతిశ‌యోక్తి కాదు.

By - Tupaki Desk
Update: 2024-02-16 20:14 GMT

అందాల పోటీలో నెగ్గాలంటే మ‌గువ‌లో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి. ``చూడ‌గానే సురుక్కుమ‌నాలి. గుండెల్లో గుబులు పుట్టాలి. ట్రెడిష‌న‌ల్ గా క‌నిపిస్తూనే వేడెక్కించే అందాల‌తో మైమ‌రిపించాలి. అందం చందంతో పాటు తెలివితేట‌లు కామ‌న్ గా ఉండాలి. టైమింగ్ సెన్స్.. హ్యూమ‌ర్ సెన్స్ ఇంటెలిజెన్స్ స‌హా ఇంకా ఇన్న‌ర్ క్వాలిటీస్ చాలా కావాలి``.. ఇవ‌న్నీ ఉంటేనే మిస్ వ‌ర‌ల్డ్ పోటీలో నెగ్గ‌డం సాధ్య‌మ‌వుతుంది. క‌నీసం మిస్ ఇండియా అవ్వాల‌న్నా ఇలాంటి చాలా క్వాలిటీస్ ఉండాలి. అవ‌న్నీ మిస్ ఇండియా వరల్డ్ 2022 టైటిల్‌ను గెలుచుకున్న సినీ శెట్టిలో పుష్క‌లంగా ఉన్నాయంటే అతిశ‌యోక్తి కాదు.

మిస్ శెట్టి కూడా అనుష్క శెట్టి వ‌చ్చిన బెంగ‌ళూరు ప‌రిస‌రాల నుంచే పోటీబ‌రిలోకి వెళుతోంది. మిస్ వ‌రల్డ్ 2024లో త‌న పేరు హాట్ ఫేవ‌రెట్ కానుంది. ఇప్పుడు మిస్ వ‌ర‌ల్డ్ 2024 పోటీల‌లో పాల్గొంటున్న శెట్టి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే డీప్ గా వివ‌రాల్లోకి వెళ్లాలి. VLCC ఫెమినా మిస్ ఇండియా 2022 గ్రాండ్ ఫైనల్స్‌లో కర్ణాటకకు చెందిన సినీ శెట్టి ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2022 టైటిల్ విజేతగా ఎంపికైంది. ఈ బ్యూటీ 2000 సంవత్సరంలో ముంబైలో జన్మించింది. అయితే ఈ బ్యూటీ సొంత రాష్ట్రం కర్ణాటక. ముంబైలోని సెయింట్ డొమినిక్ సావియో విద్యాలయ నుండి ఉన్నత పాఠశాల డిప్లొమాతో పట్టభద్రురాలైంది. అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్‌లో సినీశెట్టి బ్యాచిలర్ డిగ్రీని సంపాదించింది. ప్రస్తుతం చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్‌ల (CFA) ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌లో చేరింది. నేర్చుకోవడం కళల పట్ల ఉన్న అభిరుచిని అనుసరించడంలో త‌న‌కుటుంబం సినీశెట్టికి మద్దతు ఇచ్చింది. సిని శెట్టి హిందూ కుటుంబం నుండి వచ్చింది. ఆమె తల్లి పేరు హేమా శెట్టి. సందర్భానుసారంగా శెట్టి త‌న కుటుంబ స‌భ్యుల‌ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేస్తుంది. తోబుట్టువుల విషయానికొస్తే... త‌న‌కు షికిన్ శెట్టి అనే సోదరుడు ఉన్నాడు.

కొన్ని డ్యాన్స్ వీడియోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసింది సినీశెట్టి. చిన్నతనం నుంచి డ్యాన్స్‌ని అమితంగా ఇష్టపడ‌తాన‌ని తన అభిరుచిని పూర్తి స్థాయి కెరీర్‌గా మార్చుకోగలిగాన‌ని కూడా సినీశెట్టి తెలిపింది. నిజానికి భరతనాట్యంలో శిక్షణ పొందింది. ఇంటర్న్‌షిప్ తర్వాత త‌న‌కు ఒక మార్కెటింగ్ సంస్థ ఉద్యోగంలో చేరే అవ‌కాశం క‌ల్పించింది. శెట్టి రాణించాలనే బలమైన కోరికతో స్వతంత్రంగా ఎదిగింది.

జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన నాటి వేడుక‌లో సినీశెట్టి టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పుడు మిస్ వ‌ర‌ల్డ్ 2024 పోటీలు కూడా ఇదే క‌న్వెష‌న్ సెంట‌ర్ లో జ‌రుగనున్నాయి. అయితే ఈ పోటీల‌కు వెళుతున్నందున తాను ఒత్తిడికి గురి కాలేద‌ని సినీశెట్టి అంది. మిస్ ఇండియాగా పోటీలో పాల్గొన్న అనుభ‌వం త‌న‌కు ఉప‌క‌రిస్తుంద‌ని కూడా తెలిపింది.

సినీ శెట్టి ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు. బరువు సుమారు 54 కిలోలు. నల్లని కళ్ళు- గోధుమ రంగు జుట్టుతో శెట్టి అందానికి ప్ర‌తిరూపంగా మెరిసిపోతోంది. శెట్టి శరీర కొలతలు 31-25-35 అయితే ఆమె షూ పరిమాణం 8.5(US). శెట్టి అంద‌మైన‌ మనోహరమైన చిరునవ్వు ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది.

సినీ శెట్టి ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలనంగా మారింది. మిస్ ఇండియా కర్నాటక మాజీ విజేత, చాలా చిన్న వయస్సులో పెద్ద విజ‌యాల‌ను సాధించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో సినీశెట్టి చేసిన డ్యాన్స్ వీడియోలలో ఒకటి 20 మిలియన్ల వీక్షణలను సాధించింది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో శెట్టికి 76.8K ఫాలోవర్లు ఉన్నారు. సినీశెట్టి విజయవంతమైన మోడల్. త‌న‌ ప్రస్తుత నికర ఆస్తుల‌ విలువ రూ. 31 లక్షలు. సిని శెట్టి ప‌లు టెలివిజన్ వాణిజ్య ప్రకటనలలో నటించింది.

సిని శెట్టి జీవితం గురించి అంతగా తెలియని వాస్తవాలు wikiofcelebs.com ప్రచురించిన ఒక కథనం ప్రకారం, సినీశెట్టిని పర్పుల్ థాట్స్ ఇండియన్ మోడలింగ్ ఏజెన్సీ ప్ర‌మోట్ చేస్తోంది. ఆమె ప్రయాణాల‌ను ఇష్టపడుతుంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక అద్భుత‌మైన ప్ర‌దేశాల‌ను సందర్శించింది. జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్ మొదలైన దేశాల‌కు వెళ్లింది. ఇన్ టు ది వైల్డ్ ఆమెకు ఇష్టమైన చిత్రం. ప్రియాంక చోప్రా మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవడానికి సినీ శెట్టికి స్ఫూర్తి. సోదరుడి పేరు శికిన్ శెట్టి. తాను ‘సాంప్రదాయ సమకాలీన’ కుటుంబం నుంచి వచ్చానని సినీ శెట్టి పేర్కొంది.

Tags:    
  • Missindia 
  • Odinaindustry 
  • Anushkashetty 
  • Bengaluru 
  • Sinishetty 

Similar News

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

Copyright @2026

Powered by Blink CMS