బ్రహ్మీ సీన్స్ ముందు అనుకోలేదా.. ఫుల్‌ గా మిస్ అయ్యేవాళ్ల మేమో!

వాటర్ వరల్డ్ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది విక్టరీ వెంకటేష్ కాదు.. హాస్య బ్రహ్మ బ్రహ్మానందమే! ఆయన కనిపించిన తీరు, ఆ టైమింగ్, ఆ కామెడీ.. నువ్వు నాకు నచ్చావ్ మూవీలో ప్రత్యేక ట్రాక్‌ లా మారిపోయాయి.

Update: 2026-09-07 02:23 GMT

వాటర్ వరల్డ్ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది విక్టరీ వెంకటేష్ కాదు.. హాస్య బ్రహ్మ బ్రహ్మానందమే! ఆయన కనిపించిన తీరు, ఆ టైమింగ్, ఆ కామెడీ.. నువ్వు నాకు నచ్చావ్ మూవీలో ప్రత్యేక ట్రాక్‌ లా మారిపోయాయి. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఆ సన్నివేశాల్లో బ్రహ్మానందం పాత్ర ముందుగా కథలో లేదట. వెంకటేశ్ సజెషన్ తో ఆ సీన్స్‌ ను యాడ్ చేశారట. అదే జరగకపోయి ఉంటే.. నువ్వు నాకు నచ్చావ్ లో మనం మిస్ అయ్యే కామెడీ మరో రేంజ్ లో ఉండేదేమో!

25 ఏళ్ల క్రితం వచ్చిన ఆ సినిమా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్‌ గా నిలవడానికి ప్రధాన కారణాల్లో కామెడీ ఒకటి. కథలో లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఎంత నేచురల్ గా సాగుతాయో.. అదే రేంజ్ లో నవ్వులు కూడా పండుతాయి. అందులో బ్రహ్మానందం సీన్స్ సినిమాకు మరింత ఊపునిచ్చాయి. ముఖ్యంగా వాటర్ వరల్డ్ ఎపిసోడ్‌ కు మిస్టర్ బీన్ తరహా కామెడీ ఇన్స్పిరేషన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ సూచనతో ట్రాక్ రావడం.. తర్వాత అది ప్రేక్షకులకు ఎంతగా కనెక్ట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే బ్రహ్మానందం మాత్రమే కాదు.. సినిమాలో ప్రతి కామెడీ సీన్ వెనుక రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ మార్క్ క్లియర్ గా కనిపిస్తుంది. పంచ్ డైలాగులు, సిచ్యువేషన్లకు తగ్గ కామెడీ, రోల్స్ మధ్య కన్వర్జేషన్స్.. సినిమా కథను ముందుకు తీసుకెళ్లడంతో పాటు ప్రేక్షకులను నవ్వించాయి. ప్రకాష్ రాజ్‌, ఎం.ఎస్‌.నారాయణ, సునీల్‌ వంటి నటుల సన్నివేశాలు కూడా స్ట్రెంత్స్ లో ఒకటిగా మారాయి.

ఇక సినిమా విడుదలకు ముందు కూడా ఆసక్తికరమైన పరిస్థితి ఎదురైంది. ప్రివ్యూ చూసిన కొందరు.. సినిమా రన్ టైమ్ మూడు గంటలకు పైగా ఉండటంతో కొన్ని సీన్స్, ముఖ్యంగా సుహాసిని రోల్ కు సంబంధించిన సీన్స్‌ ను తొలగించి రన్ టైమ్ తగ్గించాలని సూచించారట. కానీ నిర్మాత స్రవంతి రవికిషోర్ మాత్రం ఒక్క సీన్ కూడా కట్ చేయలేదట. చివరకు ఆ నిర్ణయమే సరైందని బాక్సాఫీస్ రిజల్ట్ ప్రూవ్ చేసింది.

వెంకటేశ్‌ కామెడీ టైమింగ్‌, త్రివిక్రమ్‌ రైటింగ్‌, విజయ్‌ భాస్కర్‌ డైరెక్షన్.. ఈ మూడు కలవడంతో నువ్వు నాకు నచ్చావ్‌ స్పెషల్ ఎంటర్టైనింగ్ మూవీగా మారింది. సినిమాలోని చిన్న చిన్న కామెడీ ట్రాక్‌ లు తర్వాతి జెనరేషన్స్ కు కూడా గుర్తుండిపోయే రేంజ్ కు చేరాయి. అందుకే 25 ఏళ్ల తర్వాత కూడా ఆ సినిమా గురించి మాట్లాడినప్పుడు.. లవ్ స్టోరీ కంటే ముందు కొన్ని కామెడీ సీన్స్ గుర్తొస్తాయి.

ముఖ్యంగా బ్రహ్మానందం ఎపిసోడ్. అది ముందే ప్లాన్ చేసి ఉంటే అదో విషయం.. కానీ అసలు కథలో లేని సీన్స్‌, ముందుగా అనుకోని ఎపిసోడ్ ను హీరో ఇచ్చిన సజెషన్ తో యాడ్ చేసి, చివరకు సినిమాకు గుర్తింపుగా మార్చడం మాత్రం ఆసక్తికరమైన విషయం. ఒక్క నిర్ణయం.. ఒక ఎక్స్ ట్రా.. కానీ రిజల్ట్ మాత్రం ఫుల్ కామెడీ బ్లాక్‌ బస్టర్!

Tags:    

Similar News