• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హీరోయిన్ చెప్పుల...

హీరోయిన్ చెప్పుల దుకాణం..!

| ఒక్కొక్క‌రికి ఒక్కో పిచ్చి. కొంద‌రికి నిత్యం బంగారం కొనుక్కునే పిచ్చి.. కొంద‌రికి నాణేలు సేక‌రించి అభిరుచి

By - Tupaki Desk
Update: 2024-04-06 16:46 GMT

ఒక్కొక్క‌రికి ఒక్కో పిచ్చి. కొంద‌రికి నిత్యం బంగారం కొనుక్కునే పిచ్చి.. కొంద‌రికి నాణేలు సేక‌రించి అభిరుచి. మ‌రికొంద‌రికి.. ఇదిగో ఇలా చెప్పులు కొనుక్కునే అల‌వాటు! ఒక అమ్మాయి షూ రాక్ ఎప్పుడూ ఎక్కువ బూట్లు, చెప్పుల‌తో నిండి ఉండకూడదనేది సూక్తి. ఎందుకంటే రోజంతా అక్క‌డే టైమ్ వేస్ట్ అయిపోతుంది. తన విలాసవంతమైన వార్డ్‌రోబ్‌లో 3000 జతల షూలను కలిగి ఉన్న శక్తివంతమైన రాజకీయనేత‌, ఫిలిప్పీన్స్ మాజీ ప్రథమ మహిళ ఇమెల్డా మార్కోస్ గురించి ప్రపంచం చాలా చ‌ర్చించింది. ఆడంబరమైన షూ సేకరణను కలిగి ఉండటం కూడా సెలబ్రిటీల జీవితంలో భాగమే అయినా కానీ మ‌రీ ఇంత పిచ్చేమిటి? అని ప్ర‌శ్నించేవారు లేక‌పోలేదు.

పాపుల‌ర్ మీడియా ప‌ర్స‌నాలిటీ, అమెరిక‌న్ సెల‌బ్రిటీ కిమ్ కర్దాషియాన్ తన అపారమైన షూ సేకరణతో తన విలాసవంతమైన గదిని అభిమానులకు చూపించింది. అక్క‌డ కొలువుదీరిన వంద‌లాది షూస్ చూసి అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. పాపుల‌ర్ హాలీవుడ్ న‌టి కైలీ జెన్నర్ తన షూ ఫెటిష్ ను ఇన్ స్టాలో షేర్ చేయ‌గా అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. కైలీ జెన్నర్ పిల్లి హీల్స్, క్విల్టెడ్ చెప్పుల వరకు విస్తృతమైన షూ సేకరణను ఇదివ‌ర‌కూ ఆన్ లైన్ లో ప్ర‌ద‌ర్శించింది. `నాకేమైనా సమస్య ఉందా??` అని కూడా ప్ర‌శ్నించింది.

ఇప్పుడు బాలీవుడ్ లో అదే త‌ర‌హాలో షూస్, చెప్పుల సేక‌ర‌ణ‌లో అరుదైన రికార్డ్ నెల‌కొల్పింది గ్లామ‌ర‌స్ హీరోయిన్ నుష్ర‌త్ భారూచా. ప్యార్ కా పంచ్‌నామా స‌హా ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన‌ బాలీవుడ్ నటి నుష్రత్ బరుచ్చా అభిమానులందరికీ తన షూ సేక‌ర‌ణ వివ‌రాల‌ను షేర్ చేసింది. త‌న‌ ఇంట్లో శుభ్రపరిచే స‌మ‌యంలో తన గదిలో నేలపై ఉంచిన పాదరక్షలపై తనకున్న విపరీతమైన ప్రేమను వెల్లడించింది. నుష్రత్ భరుచ్చా తన ఇన్‌స్టాగ్రామ్ లో తన బూట్ల ఫోటోని షేర్ చేసింది. ``నుష్ మరియు ఆమె షూ ఫ్యాక్టరీ``తో పాటు `కాంట్ పిక్ వోంట్ పిక్` అని రాసింది. ప్ర‌స్తుతం నుష్ర‌త్ భారూచా షూఫ్యాక్ట‌రీపై నెటిజ‌నుల్లో చెణుకులు ప‌డుతున్నాయ్.

2023లో నుస్ర‌త్ నాలుగు సినిమాల్లో న‌టించింది. అక్ష‌య్ స‌ర‌స‌న సెల్ఫీ చిత్రంలో న‌టించిన నుస్ర‌త్, బ్లాక్ బ‌స్ట‌ర్ తూ జూతి మై మ‌ర‌క్క‌ర్ లో కామియోలో క‌నిపించింది. ఛ‌త్ర‌ప‌తి చిత్రంలో స‌ప్నాగా న‌టించింది. అకేళి అనే చిత్రంలోను నుష్ర‌త్ న‌టించింది. చిచోర్ చిత్రంలో న‌టించిన నుష్ర‌త్ ఇప్పుడు సీక్వెల్ చిచోర్ 2లోను న‌టిస్తోంది.

Tags:    
  • Nushrrattbharuccha 
  • Shoecollection 
  • Nushrratt 
  • Nushrrattshoes 
  • Bollywood 
  • Actressnushrratt 
  • Bollywoodactress 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS