వైట్ ఫ్రాక్ లో గ్లామర్ టచ్.. నుస్రత్ అందానికి ఫ్యాన్స్ ఫిదా!
ఈ మేరకు తాజాగా మరో లేటెస్ట్ అవుట్ ఫిట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఎఫీ కాట్స్ అనే డిజైనర్ లేబుల్ కి చెందిన ఐవరీ కలర్ కీరా డ్రెస్ ధరించి తన గ్లామర్ తో కుర్ర కారుకు చెమటలు పట్టించింది.
తెలుగు, తమిళ్ అంటూ భాషతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు తన అందచందాలతో.. అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న నుస్రత్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 2006లో జై సంతోషీ మా అనే చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ 2010లో తెలుగులో తాజ్ మహల్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2016లో తమిళంలో వాలిబా రాజు వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న నుస్రత్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ రోజుకొక ట్రెండీ ఫోటోతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ట్రెండీ అవుట్ ఫిట్ లో నుస్రత్ గ్లామర్ టచ్..
ఈ మేరకు తాజాగా మరో లేటెస్ట్ అవుట్ ఫిట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఎఫీ కాట్స్ అనే డిజైనర్ లేబుల్ కి చెందిన ఐవరీ కలర్ కీరా డ్రెస్ ధరించి తన గ్లామర్ తో కుర్ర కారుకు చెమటలు పట్టించింది. షోల్డర్ లెస్ మ్యాక్సీ కాలం గౌన్ ధరించిన ఈమె.. ఇందులో చాలా స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది. వైట్ కలర్ జాక్వర్డ్ మెటీరియల్ తో హెవీ పువ్వులను డిజైన్ చేశారు. డీప్ వీ నెక్ దీనికి బ్లాక్ కలర్ వెల్వెట్ స్టేట్మెంట్ బోలు తో కలిపి జత చేశారు. దీనికి సరళమైన జువెలరీ తో తన మేకోవర్ ను ఫుల్ ఫిల్ చేసింది నుస్రత్. మొత్తానికి అయితే షోల్డర్ లెస్ మ్యాక్సీ కాలమ్ గౌన్ ధరించి తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
తెలుగులో నుస్రత్ నటించిన చిత్రం..
తన్వీర్ భరూచా, తస్నీమ్ భరూచా దంపతులకు 1985 మే 17వ తేదీన బొంబాయి మహారాష్ట్రలో జన్మించింది . కిట్టి పార్టీ అనే టీవీ సీరియల్ ద్వారా నుస్రత్ నటన రంగంలోకి అడుగుపెట్టి, 2006లో వచ్చిన జై సంతోషీ మా అనే చిత్రం ద్వారా సినీ ప్రేక్షకులను పలకరించింది. తెలుగులో తాజ్ మహల్ సినిమాలో శృతి పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. మళ్లీ మరో తెలుగు చిత్రంలో నటించలేదు. అప్పటినుంచి ఇప్పటివరకు హిందీలోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది నుస్రత్.
నుస్రత్ ప్రస్తుత సినిమాలు..
లవ్ రంజన్ తదుపరి చిత్రంలో కూడా ఈమె అవకాశం దక్కించుకుంది. ఇందులో అజయ్ దేవగన్ , రణబీర్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరొకవైపు బన్ టిక్కీ అనే ఒక నాటకీయ చలన చిత్రంలో నటిస్తోంది. అలాగే ఘాస్టోర్ పండత్ అనే మరో హిందీ చిత్రంలో కూడా ఈమె భాగమైంది. ఒకవైపు వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న ఈమె మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో ట్రెండీ అవుట్ ఫిట్ తో అభిమానులకు దగ్గర అవుతుంది నుస్రత్. తెలుగులో కూడా మరిన్ని అవకాశాలు అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.