• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఏంటి ఉన్న‌ట్టుండి...

ఏంటి ఉన్న‌ట్టుండి చాక్లెట్ బోయ్‌లా..?

| ఎన్టీఆర్ ఇటీవలే శంషాబాద్ విమానాశ్రయంలో కనిపించగానే అత‌డి ప్ర‌యాణంపై ఆరాలు మొద‌ల‌య్యాయి.

By - Tupaki Desk
Update: 2024-03-18 15:58 GMT

ఓవైపు 'దేవ‌ర' మ‌రో వైపు 'వార్ - 2' చిత్రాల‌తో బిజీ బిజీగా ఉన్నాడు తార‌క్. ఇది అత‌డి కెరీర్ ఉత్త‌మ ద‌శ‌. వ‌రుస పాన్ ఇండియా చిత్రాల‌తో భ‌విష్య‌త్ సంచ‌ల‌నంగా మార‌బోతున్నాడు. ప్ర‌స్తుతం కొర‌టాల‌తో దేవ‌ర‌పై వంద‌శాతం ఫోక‌స్ చేసిన తార‌క్ షూటింగ్ కోసం గోవా వెళ్లాడు. ఎన్టీఆర్ ఇటీవలే శంషాబాద్ విమానాశ్రయంలో కనిపించగానే అత‌డి ప్ర‌యాణంపై ఆరాలు మొద‌ల‌య్యాయి. అత‌డు గోవా షెడ్యూల్ కోసం బయలుదేరార‌ని తెలిసింది.

గోవా విమానం ఎక్కే ముందు విమానాశ్ర‌యంలో తార‌క్ ఎంతో రిలాక్స్ డ్ గా క‌నిపించాడు. బ్లూ డెనిమ్స్, ఫుల్ స్లీవ్స్ లో అత‌డు ఎంతో స్టైలిష్ గా క‌నిపించాడు. అత‌డిని చూడ‌గానే విమానాశ్ర‌యంలో చాక్లెట్ బోయ్ ఎవ‌రు? అంటూ కొంద‌రు నెటిజ‌నులు ఫ‌న్నీగా ప్ర‌శ్నించారు. దీనికి కారణం తార‌క్ మునుపెన్న‌డూ క‌నిపించ‌నంత ఛామింగ్ గా క‌నిపిస్తున్నాడు ఈ లుక్ లో.

ప్ర‌స్తుతం గోవాలో ల్యాండ్ అయ్యాడు గ‌నుక‌ అభిమానులు సెట్స్ నుండి అప్‌డేట్‌ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేవ‌ర చిత్రానికి కొర‌టాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇంత‌కుముందే రిలీజ్ చేసిన విజువ‌ల్ గ్లింప్స్ కి అభిమానుల నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. దేవ‌ర‌కు సంబంధించిన ప్ర‌తి అప్ డేట్ అభిమానుల్లో ఉత్కంఠ పెంచుతోంది.

అలా స‌డెన్ షాకిచ్చాడు:

మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్ 'వార్ 2'లో ఎన్టీఆర్ పాత్ర గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉంటుందో రివీల్ చేస్తూ ఇంత‌కుముందు రిలీజ్ చేసిన పోస్ట‌ర్ స‌ర్వ‌త్రా ఆస‌క్తిని పెంచింది. నిజానికి అత‌డి లుక్ మునుపటి అంచనాలకు భిన్నంగా ఉంది. నిజానికి హృతిక్ క‌థానాయ‌కుడిగా క‌నిపిస్తే తార‌క్ విల‌న్ గా క‌నిపిస్తాడ‌ని ప్ర‌చార‌మైంది. కానీ తాజా లుక్ రివీల్ కాగానే, ఇద్ద‌రూ కొలీగ్స్ అన్న సంగ‌తి అర్థ‌మైంది. బాలీవుడ్ మీడియా క‌థ‌నాల‌ ప్రకారం NTR భారతీయ ఏజెంట్‌గా నటిస్తాడని, ఏజెంట్ కబీర్‌(హృతిక్‌)తో కలిసి పని చేస్తాడ‌ని కూడా తెలిసింది.

ఆ ఇద్ద‌రి మ‌ధ్యా వైరం ముఖాముఖి పోరాటాలు ఉండ‌వు. వారు ఉమ్మడి శత్రువుల‌పై క‌లిసిక‌ట్టుగా పోరాడ‌తారని తెలుస్తోంది. అయితే ఇది అభిమానులను షాక్‌కు గురి చేసింది. చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ ప్ర‌ధాన విల‌న్ గా న‌టిస్తాడ‌ని ఊహించారు. వార్ లో టైగ‌ర్ పాత్ర‌ను మించి ఎన్టీఆర్ పాత్ర‌ను ఎలివేట్ చేస్తార‌ని ఆశించారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా క‌నిపించనుండం షాకిచ్చింది. అలా ఎందుకు ప్లాన్ చేసారు? అంటే.. దానికి జ‌వాబు కూడా ఉంది. ఈ ఇద్ద‌రూ పఠాన్ 2 , టైగర్ Vs పఠాన్ చిత్రాలలోను అతిథి పాత్ర‌ల‌తో తిరిగి వచ్చే అవకాశం ఉన్నందున విస్తృతమైన YRF స్పై యూనివర్స్‌లో ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేసి వ‌దిలేస్తున్నార‌ని భావిస్తున్నారు.

అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న 'వార్ 2' చిత్రం 2025లో స్వాతంత్య్ర‌ దినోత్సవ వారాంతంలో విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్ పాత్రలో ఊహించని ట్విస్ట్ పై ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్‌లో ఇద్ద‌రు దిగ్గజ న‌టుల మ‌ధ్య కెమిస్ట్రీ ఎలా సాగుతుందో చూడాల‌ని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.


Young tiger #JrNTR Papped at Hyderabad airport off to Goa for #Devara next schedule shoot#DevaraPart1 #ManOfMassesNTR #JanhviKapoor #Tupaki pic.twitter.com/mnbU6w5vIu

— Tupaki (@tupaki_official) March 18, 2024


Tags:    
  • Tollywood 
  • Devara 
  • Ntr 
  • Kortalasiva 
  • War2 
  • Hrithikroshan 
  • Shamshabadairport 
  • Goa 

Similar News

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

మండే రోజు రామాయణం మంటలు

2026-11-10 14:11 GMT

వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!

2026-11-10 13:30 GMT

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన నిహారిక!

2026-11-10 12:54 GMT

పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?

2026-11-10 12:54 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..

2026-11-10 12:49 GMT

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

2026-11-10 12:49 GMT

Copyright @2026

Powered by Blink CMS