• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎన్టీఆర్ బ్లండర్ మిస్టేక్...

ఎన్టీఆర్ బ్లండర్ మిస్టేక్ చేశాడా?

| టీజర్ రిలీజ్ అవ్వకముందే వార్ 2 సినిమాపై హైప్ గట్టిగానే ఉంది. రిలీజ్ డేట్ గురించి బయట ఏదో నామమాత్రంగా చెప్పినా కూడా సోషల్ మీడియాలో కావాల్సినంత బజ్ వచ్చింది.

By - Tupaki Desk
Update: 2025-05-22 03:00 GMT

టీజర్ రిలీజ్ అవ్వకముందే వార్ 2 సినిమాపై హైప్ గట్టిగానే ఉంది. రిలీజ్ డేట్ గురించి బయట ఏదో నామమాత్రంగా చెప్పినా కూడా సోషల్ మీడియాలో కావాల్సినంత బజ్ వచ్చింది. కానీ టీజర్ తరువాత సీన్ ఒక్కసారిగా మారిపోయింది. టాక్ నుంచి బిజినెస్ వరకు సినిమా చుట్టూ నెగిటివ్ వైబ్ ఎక్కువగా వైరల్ అవుతోంది.

ఎన్టీఆర్ కారణంగా ఇంతకుముందు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల కోసమే 75 కోట్ల వరకు రిస్క్ తీసుకోవాలి అనుకున్న వారు ఇప్పుడు 50 కోట్లకు తగ్గారు అని కూడా టాక్ నడుస్తుంది . ఆ రేటుకు ఇస్తే ఓకే, లేదంటే లేదు అంటున్నారు అంటే టీజర్ ఎంతగా ఇంపాక్ట్ చూపించిందో అర్థం చేసుకోవచ్చు. సినిమాలో బాలీవుడ్ స్టైల్ కు తగ్గట్లే రెగ్యులర్ కంటెంట్ ఉంటుందనే అనుమానాలు గట్టిగానే వస్తున్నాయి.

ఇవన్నీ పక్కన పెడితే ఎన్టీఆర్ అసలు ఈ టైమ్ లో ఇలాంటి రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే అనుమానాలు వస్తున్నాయి. RRR ఏ రేంజ్ లో హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హాలీవుడ్ టెక్నీషియన్స్ సైతం అతని పర్ఫెమెన్స్ కు ఫిదా అయ్యి ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఉందని ఓపెన్ గానే చెప్పారు.

ఇక జపాన్ లో కూడా ఎన్టీఆర్ మంచి క్రేజ్ ఏర్పడింది. దేవర అంటే RRR కంటే ముందే ఒప్పుకున్న కమిట్మెంట్. ఆ సినిమా కంటెంట్ కూడా రొటీన్ అనే వాదన ఉంది. అది కేవలం అనిరుద్, ఎన్టీఆర్ వల్ల 500 కోట్లు కొట్టేసింది అనే వారు కూడా ఉన్నారు. ఇక RRR ఇచ్చిన బూస్ట్ తో బాలీవుడ్ లో క్రేజ్ ను మరో లెవెల్ కు తీసుకు వెళ్ళడానికి ఎన్టీఆర్ అక్కడ వార్ 2 లాంటి ప్రయోగాలు చేయడంలో తప్పు లేదు.

కానీ కంటెంట్ గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. టీజర్ చూశాక అందులో ఉన్న కంటెంట్ చూస్తే ఎన్టీఆర్ మార్క్ కు తగ్గ స్టఫ్ లేదు అనేలా చాలా రకాల కామెంట్స్ వస్తున్నాయి. ఫుల్ సినిమాలో ఇంతకంటే ఇంకేముంటుంది అనేలా మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

దీంతో ఎన్టీఆర్ పెద్ద బ్లండర్ మిస్టేక్ చేశాడా అని ఫ్యాన్స్ లో అనుమానం మొదలవుతోంది. హృతిక్ రోషన్, కియారా రోల్స్ బాగానే హైలెట్ అయ్యాయి. కానీ ఎన్టీఆర్ మార్క్ కు తగ్గ కంటెంట్ అయితే టీజర్ లో హైలెట్ కాలేదు. ఇక కెరీర్ నెక్స్ట్ లెవెల్ కు వెళుతున్న క్రమంలో ఎన్టీఆర్ చాలా జాగ్రత్తగా ప్రాజెక్టులు సెలెక్ట్ చేసుకోవాల్సిన సమయం ఇది.

అలాంటిది వార్ 2 దెబ్బెస్తే నెక్స్ట్ చేయబోయే సినిమాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. తారక్ నెక్స్ట్ నీల్ డ్రాగన్ సినిమా ఉంది. దానిపై నమ్మకం పెట్టుకోవచ్చు. ఇక దేవర 2 అంటే ఏదైనా మ్యాజిక్ జరగాలి. నెల్సన్ కూడా లైన్ లో ఉన్నాడు. సరైన ట్రాక్ లో సెట్ చేసుకుంటే సోలో హీరోగా 1000 కోట్ల మార్క్ ను అందుకునే టైమ్ ఇది. కానీ వార్ 2 తేడా కొడితే మళ్ళీ సెట్టవ్వడానికి కష్టపడాలి. ఇక వార్ 2 అనేది బ్లండర్ మిస్టేకా లేదంటే అంచనాలను అందుకొని ఏదైనా మ్యాజిక్ చేస్తుందా అనేది రిలీజ్ తరువాత తెలుస్తుంది.

Tags:    
  • JrNTR 
  • War2 
  • War2Teaser 
  • Bollywood 
  • Tollywood 
  • RRRStar 
  • NTR 
  • HrithikRoshan 
  • Devara 
  • Kriti 

Similar News

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS