• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్మార్ట్ అండ్ కూల్ గా...

స్మార్ట్ అండ్ కూల్ గా ఎన్టీఆర్ న్యూలుక్.. రూ.8 కోట్లు ఛార్జ్!

| ఎంతో స్టైలిష్ గా మారిపోయారు. దానికి సంబంధించిన ఫొటో కూడా బయటకు వచ్చింది.

By - Tupaki Desk
Update: 2023-08-09 06:26 GMT

టాలీవుడ్ లో ఎంత మంది హీరోలు ఉన్న నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎన్టీఆర్ కు ఓ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం ఆయన తెలుగు చిత్రసీమలోని టాప్ హీరోలలో ఒకరుగా రాజ్యమేలేస్తున్నారు. ఆ మధ్యలో 'ఆర్ఆర్ఆర్'తో వరల్డ్ వైడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న తారక్.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' అనే భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు.


ఈ చిత్రం చేస్తూనే.. ఇతర భారీ కాంబినేషన్ మూవీస్ సెట్ చేస్తున్నారు తారక్. మరోవైపు కమర్షియల్ యాడ్స్ తోనూ ఆకట్టుకుంటున్నారు. పలు సంస్థలకు బ్రాండ్స్ అంబాసిడర్ గానూ సైన్ చేస్తున్నారు. ఇప్పటికే లీషియస్ ఫుడ్, యాపీ ఫిజ్, మెక్ డొనాల్డ్స్ వంటి ప్రకటనలతో ఆడియెన్స్ ముందుకు వచ్చిన తారక్.. ఆ ప్రకటనల్లో తన లుక్స్ తోనూ ఆకట్టుకుంటున్నారు.

తాజాగా ఆయన ఇప్పుడు మరో సూపర్ యాడ్ కు సిద్ధమైనట్లు తెలిసింది. ఈ ప్రకటనకు సంబంధించిన చిత్రీకరణ కూడా జరిగినట్లు సమాచారం అందింది. ఈ యాడ్ కోసం తారక్.. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ తో కలిసి పని చేశారు. తన పూర్తి లుక్ ను ఛేంజ్ చేసేశారు. ఎంతో స్టైలిష్ గా మారిపోయారు. దానికి సంబంధించిన ఫొటో కూడా బయటకు వచ్చింది. గుబురు గడ్డం, కళ్ళజోడు, సూపర్ హెయిర్ స్టైల్ తో ఎన్టీఆర్ వావ్ అనిపించేలా కనిపించారు.

ప్రస్తుతం స్మార్ట్ అండ్ కూల్ లుక్ లో ఉన్న తారక్ ఫొటో నెట్టింట్లో ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఫ్యాన్స్ కు ఓ రేంజ్ లో కిక్ ఇస్తోంది. ఇకపోతే ఇది ఏ యాడ్ కోసమో తెలీదు కానీ.. దీని కోసం ఎన్టీఆర్ రూ. 6 నుంచి రూ. 8 కోట్ల వరకు ఛార్జ్ చేశారని అంతా అనుకుంటున్నారు. అలానే ఒక యాడ్ కోసం ఎన్టీఆర్ ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోవడంపై ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్నారు.

ఇక దేవర సినిమా విషయానికొస్తే.. 'జనతా గ్యారేజ్' వంటి హిట్ మూవీ తర్వాత ఎన్టీఆర్ - కొరటాల కాంబోలో రానున్న చిత్రమిది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంతో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనుంది. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.

Tags:    
  • Tollywood 
  • Youngtiger 
  • Ntr 
  • Newlooks 
  • Alimhakim 
  • Hairstylist 
  • Brandambassdor 
  • Shoot 
  • Coollook 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS