'దేవర'.. ఆ వర్క్ కోసమే 100 కోట్లు

దర్శకుడు కొర‌టాల శివ‌తో యంగ్ టైగర్​ ఎన్టీఆర్ దేవర అనే భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.;

Update: 2023-08-27 04:11 GMT

దర్శకుడు కొర‌టాల శివ‌తో యంగ్ టైగర్​ ఎన్టీఆర్ దేవర అనే భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీఎఫ్​ఎక్స్​ పెద్ద పీట వేస్తూ ఈ సినిమాను సీ(సముద్రతీరం) కాన్సెప్ట్​తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా పక్కా పవర్​ఫుల్​ యాక్షన్ ప్యాక్డ్​ ఎంటర్​టైనర్​గా రూపొందుతోంది. మ్యూజిక్​-సినిమాటోగ్రఫీ-ఎడిటింగ్- క‌ళ- యాక్ష‌న్ ఇలా అన్ని విభాగాల్లో టాప్ టెక్నీషియ‌న్లు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు.

ప్రముఖ హాలీవుడ్ టెక్నిషియన్స్, కొరియోగ్రాఫర్స్​​ కూడా ఈ సినిమా కోసం బరిలోకి దిగి పని చేస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ కొత్త వార్త బయటకు వచ్చింది. అదేంటంటే ఈ సినిమా వీఎఫెఎక్స్ వర్క్ ప్రారంభించుకుందని తెలిసింది. సినిమాలో ఇప్పటి వరకు చిత్రీకరించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలను విడివిడిగా.. కొంతమంది వీఎఫెఎక్స్​ ఎక్స్​పర్ట్స్​ టీమ్స్​కు పంపినట్లు సమాచారం అందింది.

ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్‌-యువసుధ ఆర్ట్స్ ​ దాదాపు రూ.300కోట్ల భారీ బడ్జెట్​తో తెరకెక్కిస్తున్నారని తెలిసింది. ఇందులో రూ.80 నుంచి రూ.100కోట్ల బడ్జెట్​ను కేవలం వీఎఫెఎక్స్ వర్క్ కోసమే ఖర్చు చేయబోతున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలను ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే హైదరాబాద్​లో పలు భారీ సీ సెట్స్​ వేసి షెడ్యూళ్లను కూడా పూర్తి చేశారు.

సినిమాలో ఆదిపురుష్ ఫేమ్​ 'రావ‌ణ్‌' సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటించనుండటం మ‌రో ఆస‌క్తిక‌ర విషయం. అలాగే ఈ చిత్రంతోనే బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుండటం అభిమానుల‌కు ఎంతో ప్ర‌త్యేకంగా మారింది. జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత కొరటాల-ఎన్టీఆర్ కాంబోలో ఇది రానుంది. అలా ఈ అంశాలన్నీ తార‌క్ అభిమానుల్లో సినిమాపై భారీ అంచనాలు ఏర్పరచాయి.

ఇకపోతే మాస్‌ యాక్షన్‌ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో తారక్‌ ఓ సరికొత్త లుక్‌తో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన పోస్టర్​ కూడా బాగా ఆకట్టుకుంది. పాన్‌ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ఈ చిత్రం గ్రాండ్​గా వరల్డ్​వైడ్​గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మ్యూజిక్ సెన్సేషన్​ అనిరుధ్‌ స్వరాలందిస్తున్నారు. ఆర్‌.రత్నవేలు ఛాయాగ్రాహకుడిగా వ్యవహిరస్తున్నారు.

Tags:    

Similar News