• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎన్టీఆర్, అల్లరి నరేష్...

ఎన్టీఆర్, అల్లరి నరేష్ కాంబో.. జస్ట్ మిస్

| కొన్నాళ్ళు సినిమాలకు దూరమై రీసెంట్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ లో సీరియస్ సినిమాలతో ప్రేక్షకులను తెప్పిస్తున్నాడు.

By - Tupaki Desk
Update: 2023-12-04 00:30 GMT

టాలీవుడ్ లో కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరించి హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ గురించి తెలిసిందే. హిట్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా ఏడాదికి రెండు నుంచి మూడు సినిమాలు రిలీజ్ చేసి ఆడియన్స్ ని నవ్వించిన హీరో అల్లరి నరేష్. అలాంటి ఈ హీరో ఒకానొక దశలో వరుస ప్లాప్స్ అందుకున్నాడు. తనకు సూట్ కాని కథలను ఎంచుకుని రిస్క్ చేశాడు. కొన్నాళ్ళు సినిమాలకు దూరమై రీసెంట్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ లో సీరియస్ సినిమాలతో ప్రేక్షకులను తెప్పిస్తున్నాడు.

అయితే గతంలో అల్లరి నరేష్ ఓ స్టార్ హీరోతో సినిమా చేయాల్సింది. కానీ అది జస్ట్ లో మిస్ అయింది. ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబినేషన్స్ సెట్ అయినట్లే అయి మిస్ అయిపోతుంటాయి. అలాంటి క్రేజీ కాంబినేషన్స్ లో ఎన్టీఆర్ - అల్లరి నరేష్ కాంబో కూడా ఒకటి. వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా చేయడానికి ఓ డైరెక్టర్ ఎంతగానో ప్రయత్నించారట. కానీ అది వర్కౌట్ కాలేదు.

డీటెయిల్ గా చెప్పాలంటే.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా 'మహర్షి'. ఈ మూవీలో సెకండ్ హీరోగా అల్లరి నరేష్ నటించిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. నిజానికి ఈ సినిమాలో ముందుగా మహేష్ బాబు రోల్ కోసం ఎన్టీఆర్ ని అనుకున్నారట వంశీ పైడిపల్లి. తారక్ కి కథ కూడా వినిపించాడట.

మంచి మెసేజ్, కాన్సెప్ట్ ఉన్న స్టోరీ కావడంతో తారక్ చేస్తే ఈ మూవీ ఆడియన్స్ కి బాగా నచ్చుతుందని వంశీ చాలాసార్లు ట్రై చేశారట. అయితే అప్పటికే తారక్ వేరే సినిమాలో బిజీగా ఉండడంతో వంశీ పైడిపల్లి సినిమా కోసం కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాడట. ఆ సమయంలో ఎన్టీఆర్ తో సినిమా చేయాలంటే మరో రెండు సంవత్సరాలు అయినా వెయిట్ చేయాలి. అంత సమయం లేక వంశీ పైడిపల్లి ఎన్టీఆర్ ప్లేస్ లో మహేష్ బాబును తీసుకున్నారు.

అలా తారక్ - అల్లరి నరేష్ కాంబినేషన్లో సినిమా మిస్ అయింది. ఇప్పుడు ఎలాగో టాలీవుడ్లో మల్టీ స్టారర్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో అయినా వీళ్ళిద్దరూ కలిసి మల్టీ స్టారర్ మూవీలో నటిస్తారేమో చూడాలి. ఇక ఎన్టీఆర్ ప్రెజెంట్ 'దేవర' మూవీ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత 'వార్ 2' షూటింగ్లో జాయిన్ అవుతాడు. అటు అల్లరి నరేష్ 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాను తెరకెక్కించిన సుబ్బు దర్శకత్వంలో 'బచ్చలమల్లి' అనే సినిమా చేస్తున్నాడు.

Tags:    
  • Tollywood 
  • Allarinaresh 
  • Maharshi 
  • Maheshbabu 
  • Poojahedge 
  • Vamsipaidipally 
  • Ntr 
  • Devara 
  • War2 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS