టాలీవుడ్ తో బాలీవుడ్ మేక‌ర్స్ కి ఇబ్బందే!

టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలున్నా? ఏరికోరి మ‌రీ ఆయాన్ ముఖ‌ర్జీ ఎన్టీఆర్ ని తీసుకున్నారు. సినిమాలో తార‌క్ పాత్ర ప‌రంగా ఎన్నో సందేహాలున్నాయి.;

Update: 2025-08-12 08:30 GMT

`వార్ 2` తో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలున్నా? ఏరికోరి మ‌రీ ఆయాన్ ముఖ‌ర్జీ ఎన్టీఆర్ ని తీసుకున్నారు. సినిమాలో తార‌క్ పాత్ర ప‌రంగా ఎన్నో సందేహాలున్నాయి. విల‌న్ పాత్ర‌లో తార‌క్ న‌టిస్తున్నాడ‌ని...విల‌న్ పాత్ర అయినా హృతిక్ రోష‌న్ హీరో పాత్ర‌కు ధీటుగా ఉంటుంద‌ని ప్ర‌చారం లో ఉంది. హీరోకి ప్ర‌త్య‌ర్ది పాత్ర అయినా పాత్ర‌లో పాజి టివిటీ మ‌రో హీరోలా హైలైట్ చేస్తుంద‌న్న‌ది మ‌రో వెర్ష‌న్. సినిమా మొద‌లైన ద‌గ్గ‌ర నుంచి రక‌ర‌కాల స్పెక్యులేష‌న్స్ తెర‌పైకి వ‌చ్చాయి.

ఆయాన్ క్లారిటీ ఇవ్వాల్సిన ప‌రిస్థితి:

చివ‌రికి తార‌క్ పాత్ర ఎలా ఉంటుంది? అన్న దానిపై దర్శ‌కుడు ఆయాన్ ముఖ‌ర్జీ కూడా స్పందించాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ప్రీ రిలీజ్ వేడుక‌లో రెండు పాత్ర‌లు స‌మానంగా ఉంటాయ‌న్న‌ట్లు...ఎవ‌ర్నీ త‌క్కు వ చేయ‌లేదన్న‌ట్లు ఆయాన్ వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసారు. ఇదే పాత్ర‌కు బాలీవుడ్ లోనే మ‌రో స్టార్ ని తీసుకుంటే ఇన్ని ర‌కాల ప్ర‌చారాలు తెర‌పైకి వ‌చ్చేవి కావు. కేవ‌లం తెలుగు హీరో కావ‌డంతోనే ఇన్ని ర‌కాల సందేహాలు త‌లెత్తాయి. తెలుగు హీరోల‌పై ఉండే ఇమేజ్..బ‌జ్ మాత్రమే ఇలాంటి ప‌రిస్థితుల‌కు దారి తీస్తుంది. తెలుగు హీరో మ‌రో స్టార్ సినిమాలో విల‌న్ పాత్ర పోషిస్తున్నాడు? అంటే ఇక్క‌డ ఆడియ‌న్స్ అంగీ క‌రించడం అంత సుల‌భం కాదు.

తెలుగు ఆడియ‌న్స్ ని క‌న్విన్స్ చేయాలి:

అందుకే సాహ‌సించాలి అనుకునే తెలుగు డైరెక్ట‌ర్ కూడా అలాంటి ప్ర‌య‌త్నం చేయ‌రు. బాలీవుడ్ లో హీరోల రోల్స్ ఛేంజెస్ అయినా అక్క‌డ ఆడియ‌న్స్ యాక్సెప్ట్ చేస్తారు. రెండు ప‌రిశ్ర‌మ‌ల మ‌ధ్య ఉన్న ప్ర‌ధాన వ్య‌త్యాసమిది. తార‌క్ విష‌యంలో ఆయాన్ చూసిన స‌న్నివేశం అదే. దీంతో భ‌విష్య‌త్ లో బాలీవుడ్ డైరెక్ట‌ర్లు తెలుగు హీరోల‌తో ప‌నిచేయాలంటే? ముందుగా తాము రాసే క‌థ‌ల్లో తెలుగు హీరోల్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు? అన్న దానిపై పూర్తి క్లారిటీ ఉండాలి. తెలుగు ఆడియ న్స్ కు విష‌యాన్ని ముందే చెప్పి ఒప్పించ‌గ‌ల‌గాలి. నెగిటివ్ పాత్ర అయినా క‌న్విన్స్ చేయ‌గ‌లిగితేనే ఎలాంటి స్పెక్యులేష‌న్స్ కు ఆస్కారం ఉండ‌దు.

ఎన్నో సందేహాల‌కు వార్ 2 స‌మాధానం:

లేదంటే రిలీజ్ త‌ర్వాత అంచ‌నాలే సినిమా ఫ‌లితాన్నే తారు మారు చేస్తుంటాయి. `ఆర్ ఆర్ ఆర్` సినిమా లో తార‌క్ రోల్ రామ్ చ‌ర‌ణ్ పాత్ర‌కు ధీటుగా లేద‌నే కోపంతో థియేట‌ర్ డొర్లు, కుర్చీలు బ‌ద్ద‌లైన సంగ‌తి తెలిసిందే. `ఆర్ ఆర్ ఆర్` సినిమా హిట్ అయినా ఆ వివాదం సినిమాకు ఓ మ‌చ్చ‌లా మారింది. మ‌రి `వార్ 2` తో ఆయాన్ అలాంటి ప్ర‌తికూల ప‌రిస్థితుల‌కు ఛాన్స్ ఇచ్చి ఉండ‌డ‌ని తార‌క్ అభిమానులు భావి స్తున్నారు. `వార్ 2` ఫ‌లితం ఎలా ఉంటుంది? అన్న దానిపై టాలీవుడ్ స‌హా బాలీవుడ్ మేక‌ర్స్ ఎంతో మంది ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. చాలా సందేహాల‌కు....ప్ర‌శ్న‌ల‌కు ఈ సినిమా ఫ‌లితం ఓ స‌మాధానంలా నిల‌వాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు.

Tags:    

Similar News