ఎన్టీఆర్‌- త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్‌ని క‌న్ఫ‌ర్మ్‌ చేశాడుగా!

బ‌న్నీతో చేయాల‌నుకున్న ప్రాజెక్ట్‌ని ఎన్టీఆర్‌తో చేస్తున్నామ‌ని యువ నిర్మాత‌, సితారా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ సోష‌ల్ మీడియా వేదిక‌గా క్లారిటీ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.;

Update: 2025-06-11 10:21 GMT

'పుష్ప 2' త‌రువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌తో ఓ భారీ మైథ‌లాజిక‌ల్ డ్రామాని చేయ‌బోతున్న‌ట్టుగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే 'పుష్ప 2' పాన్ ఇండియా వైడ్‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డ్తో బ‌న్నీ ప్లాన్ మారింది. త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్ స్థానంలో త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీతో పాన్ వ‌ర‌ల్డ్ సినిమాకు శ్రీ‌కారం చుట్టాడు. ఈ మార్పే త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్‌ని చేతులు మారేలా చేసి ఫైన‌ల్‌గా అది ఎన్టీఆర్ వ‌ద్ద‌కు చేరేలా చేసింది. మైథ‌లాజిక‌ల్ మూవీ కావ‌డం, దీనికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్‌కు స‌మ‌యం ప‌ట్టేలా ఉండ‌టంతో అట్లీ ప్రాజెక్ట్‌ని బ‌న్నీ ఎంచుకున్నాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది.

తాజా ప‌రిణామాలు చూస్తే అదే నిజ‌మ‌ని తెలుస్తోంది. అంతే కాకుండా ఈ ప్రాజెక్ట్ చేతుల మారి ఎన్టీఆర్ వ‌ద్ద‌కు వెళ్లింద‌నే ప్ర‌చారానికి బ‌లాన్ని చేకూరుస్తూ బ‌న్నీతో చేయాల‌నుకున్న ప్రాజెక్ట్‌ని ఎన్టీఆర్‌తో చేస్తున్నామ‌ని యువ నిర్మాత‌, సితారా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ సోష‌ల్ మీడియా వేదిక‌గా క్లారిటీ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

నాకు అత్యంత అభిమాన‌మైన అన్న వ‌న్ ఆఫ్ ద మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ గాడ్‌గా క‌నిపించ‌బోతున్నాడ‌ని చెబుతూ 'కార్తికేయో మ‌హాసేన శ్వ‌ర‌జ‌న్మా ష‌డాన‌నః,పార్వ‌తీ నంద‌నః స్కంద స్సేనానీ ర‌గ్నిభూర్గుహః' అనే స్లోకాన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎన్టీఆర్‌- త్రివిక్ర‌మ్‌ల మైథ‌లాజిక‌ల్ ప్రాజెక్ట్‌ని ఆల్ మోస్ట్ క‌న్ష‌ర్మ్ చేసేశాడు. సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ పోస్ట్ చేసిన శ్లోకాన్ని బ‌ట్టే ఈ మైథ‌లాజిక‌ల్ డ్రామా కార్తికేయ స్వామి నేప‌థ్‌యంలో సాగుతుంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

అంతే కాకుండా సోష‌ల్ మీడియాలో `గాడ్ ఆఫ్ వార్ క‌మింగ్‌` అంటూ మ‌రో శ్లోకాన్ని పోస్ట్ చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. `మ‌యూరాధిరూఢం మ‌హావాక్య‌గూఢం..మ‌నోహారిదేహం మ‌హాచ్చిత్త‌గేహ‌మ్| మ‌హీదేవ‌దేవం మ‌హావేద‌భావం మ‌హాదేవ‌బాలం భ‌జే లోక‌పాల‌మ్‌|| 3 ||` అంటూ మ‌రో హింట్ ఇచ్చారు. ఇంత వ‌ర‌కు పురాణాల్లోని శివుడి మీద‌, వినాయ‌కుడిపై ఎన్నో సినిమాలొచ్చాయి. కానీ కార్తికేయుడిపై మాత్రం రాలేదు.

కుమార‌స్వామిని సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి, స్కంద‌, మురుగ‌న్ అని కూడా పిలుస్తారు. అలాంటి కుమార‌స్వామి క‌థ‌లోని ప్ర‌ధాన ఘ‌ట్టాల‌ని తీసుకుని ఆయ‌న స్కంద సైన్యం నేప‌థ్యంలో త్రివిక్ర‌మ్ ఈ మైథ‌లాజిక‌ల్ మూవీని తెర‌పైకి తీసుకురావాల‌నుకుంటున్నార‌ట‌. సూర్య‌దేవ‌ర న‌గావంశీ పోస్ట్ చేసిన శ్లొకంలో `స్కంద స్సేనాని`ని ప్ర‌త్యేకంగా కోట్ చేశారు. దాన్ని బ‌ట్టి చూస్తే ఈ భారీ మైథ‌లాజిక‌ల్ డ్రామాకు ఇదే పేరుని ఫైన‌ల్ చేసే అవ‌కాశం ఉంద‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి.

Tags:    

Similar News