• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దేవర రిలీజ్.. తారక్...

దేవర రిలీజ్.. తారక్ ఏమన్నారంటే?

| టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. దేవర పార్ట్ -1తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-09-27 09:34 GMT

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. దేవర పార్ట్ -1తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఆ సినిమా.. గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా నేడు రిలీజ్ అయింది. ఎప్పటి నుంచో తారక్ అభిమానులందరూ ఎదురుచూస్తున్న మూవీ.. నేడు భారీ స్థాయిలో థియేటర్లలోకి వచ్చేసింది. నిన్న అర్ధరాత్రి ఒంటి గంట నుంచే అమెరికా సహా మన దేశంలో అనేక చోట్ల స్పెషల్ షోస్ పడ్డాయి. అన్ని చోట్ల ఫ్యాన్స్ ఫుల్ సందడి చేస్తున్నారు.

సినిమాలో డ్యూయల్ రోల్ పోషించిన తారక్.. దేవరగా, వరగా అదరగొట్టారు. రెండు క్యారెక్టర్లలో వైవిధ్యాన్ని బాగా చూపించారు. తన కళ్లలతో హావభావాలను పలికిస్తూ మెప్పించారు. సినిమాలోని కీలక సన్నివేశాల్లో ఎన్టీఆర్ ఎమోషన్లు వేరే లెవెల్ లో పండించారు. మూవీని కొన్ని నార్మల్ సీన్స్ ను తారక్ తన యాక్టింగ్ తో నిలబెట్టారు. అయితే దేవర కోసం ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేపట్టిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాలో థ్యాంక్స్ చెబుతూ పోస్ట్ పెట్టారు.

"నేను ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. మీ అపురూపమైన స్పందనలతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాను. కొరటాల శివ గారు.. మీరు ఆకర్షణీయమైన డ్రామా, భావోద్వేగాలతో దేవరను తీర్చిదిద్దినందుకు ధన్యవాదాలు. బ్రదర్ అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. దేవర ప్రపంచానికి ప్రాణం పోసింది. సినిమాకు స్ట్రాంగ్ పిల్లర్స్ కు నిలిచినందుకు నిర్మాతలు హరికృష్ణ కొసరాజు గారికి, సుధాకర్ మిక్కిలినేని ప్రత్యేక ధన్యవాదాలు" అని తెలిపారు.

"రత్నవేలు ప్రసాద్ సర్, సిరిల్ సర్, శ్రీకర్ ప్రసాద్ sir.. మీ వర్క్ కు ఎప్పుడు కృతజ్ఞుడిగా ఉంటాను. అద్భుతంగా పని చేసిన ప్రతి టెక్నీషియన్‌ కు బిగ్ థ్యాంక్స్. దేవర మూవీ రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ జరుపుకుంటున్న వేడుకలు.. నన్ను చాలా ఉప్పొంగేలా చేసింది. మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటా" అని తారక్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. చివరలో తన ఫ్యాన్స్ అందరినీ ఎప్పటికీ అలరిస్తూనే ఉంటానని ఎన్టీఆర్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం తారక ట్వీట్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. మాస్ యాక్షన్ తో చించేశావన్న అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.. మరి దేవర మూవీ మీరు చూశారా?

The day I had been waiting for is finally here... Overwhelmed by your incredible reactions. - #JrNTR #Devara #DevaraPart1 #DevaraCelebrations #Tupaki pic.twitter.com/UYoqmrXhaI

— Tupaki (@tupaki_official) September 27, 2024
Tags:    
  • Devara 
  • Ntr 
  • Koratalasiva 
  • Janhvikapoor 
  • Saifalikhan 
  • Anirudh 
  • Kalyanram 
  • Tollywood 
  • Fans 

Similar News

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

Copyright @2026

Powered by Blink CMS