తారక్- నీల్ రూమర్స్.. అసలు క్లారిటీ ఇదే..

అయితే దానికి పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే బడా హీరోల సినిమాల టైమ్ లో ఇలాంటి రూమర్లు కామన్.;

Update: 2025-10-22 07:37 GMT

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆ ప్రాజెక్ట్‌ పై ఆడియన్స్ తోపాటు ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా మూవీ కోసం బాగా బరువు తగ్గి, లుక్ ను మార్చుకున్న తారక్ ను ప్రశాంత్ నీల్ ఎలా చూపించనున్నారోనని ఎదురుచూస్తున్నారు.

అయితే కొన్ని గంటలుగా సినిమా షూటింగ్ ఆగిందని, హీరో- డైరెక్టర్ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్లు ఊహాగానాలు చక్కర్లు కొడుతుండడంతో ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. మొదటి షెడ్యూల్‌ అవుట్‌ పుట్‌ ఎన్టీఆర్‌ కు నచ్చలేదనే కారణంతో, స్క్రిప్ట్‌ మార్పులపై దర్శకుడితో విభేదాలు తలెత్తాయని రూమర్స్ స్ప్రెడ్ అవ్వడంతో డిస్కస్ చేసుకుంటున్నారు.

ప్రాజెక్టును కొంత కాలంపాటు పాజ్ చేయాలని నిర్ణయించుకున్నారని వార్తలు వస్తుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అభిమానులు స్పందించి క్లారిటీ ఇవ్వాలని సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నా.. ఎవరి నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. మైత్రీ గానీ, నీల్ గానీ, తారక్ గానీ ఎవరూ స్పందించలేదు. దీంతో ఏం జరుగుతుందోనని సినీ ప్రియులు డిస్కస్ చేస్తున్నారు.

అయితే దానికి పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే బడా హీరోల సినిమాల టైమ్ లో ఇలాంటి రూమర్లు కామన్. ముఖ్యంగా తారక్ ఇప్పటికే నటించిన దేవర మూవీ సమయంలో సేమ్ అలాంటి వార్తలు వచ్చాయి. వాటిపై పెద్ద చర్చలు జరిగినా.. ఎవరూ స్పందించలేదు. ఆ తర్వాత అంతా నార్మల్ అయింది.. సినిమా రిలీజ్ అయింది.. అందరినీ ఆకట్టుకుంది.. సీక్వెల్ కూడా రానుంది.

ఇప్పుడు ప్రశాంత్ నీల్ మూవీ విషయానికొస్తే.. ఆయన లెక్క వేరు.. సైలెంట్ గా పని కానిస్తారు. టెక్నీషియన్స్, నటులను ఎలా హ్యాండిల్ చేయాలో ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. సరైన విధంగా ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తారు. ఎక్కడా తొందరపడరు.. సినిమా షూటింగ్ టైమ్ లో వచ్చే రూమర్స్ ను పట్టించుకోరు. కాబట్టి ఇప్పుడు తారక్ అసంతృప్తి చెందారని, నీల్ తో అభిప్రాయభేదాలు వచ్చాయన్న వార్తలన్నీ అబద్ధమే.

ఇప్పటికే కొంత భాగం షూట్ అయింది. ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక ఫుటేజ్ చూసుకుని అందుకు తగ్గట్టు నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తారు ప్రశాంత్ నీల్. ఇప్పుడు స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. అందుకే కొత్త షెడ్యూల్ మొదలు కాలేదు. అయితే రీరైట్ అనేది కేజీఎఫ్, సలార్ సినిమాలకూ ఫాలో అయ్యారు నీల్. అది ఆయన క్రియేటివ్ ప్రాసెస్ లో భాగమే. అంతే తప్ప ఏదో జరిగిందనుకోవడం పుకారు మాత్రమే.

Tags:    

Similar News